Title (Indic)గక్కన చెక్కునొక్కేవు కమ్మటి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గక్కన చెక్కునొక్కేవు కమ్మటి నీవు కిక్కిరిసిన వేడుకఁ గృపఁ జూడవయ్యా (॥గక్క॥) నేరుపరిసతినైతే నీతో మాటాడుటగాక వూరకుండేముద్దరాల నోపుదునా గారవించి యింతయేల కదిసి వెడ్డువెట్టేవు మారీతి నీవెఱఁగవా మన్నించవయ్యా (॥గక్క॥) చన్నులు గొప్పలైతే సరివెనఁగుదుఁగాక చిన్నదాన నే నింతేసికిఁ గలనా యిన్నిటా సారెకునేల యిచ్చకము సేసేవు కన్నులెదుట నుందాన కరుణించవయ్యా (॥గక్క॥) మిక్కిలి ప్రౌఢనైతే మేలములాడుదుఁగాక యిక్కువ సిగ్గరికత్తె వింతసేసేనా వొక్క టైతివి శ్రీవేంకటోత్తమ యేల దూరేవు తక్కులఁబెట్టక యిట్టె దయఁజూడరాదా English(||pallavi||) gakkana sĕkkunŏkkevu kammaḍi nīvu kikkirisina veḍugam̐ gṛpam̐ jūḍavayyā (||gakka||) nerubarisadinaide nīdo māḍāḍuḍagāga vūraguṁḍemuddarāla nobudunā gāraviṁchi yiṁtayela kadisi vĕḍḍuvĕṭṭevu mārīdi nīvĕṟam̐gavā manniṁchavayyā (||gakka||) sannulu gŏppalaide sarivĕnam̐gudum̐gāga sinnadāna ne niṁtesigim̐ galanā yinniḍā sārĕgunela yichchagamu sesevu kannulĕduḍa nuṁdāna karuṇiṁchavayyā (||gakka||) mikkili prauḍhanaide melamulāḍudum̐gāga yikkuva siggarigattĕ viṁtasesenā vŏkka ṭaidivi śhrīveṁkaḍottama yela dūrevu takkulam̐bĕṭṭaga yiṭṭĕ dayam̐jūḍarādā