గక్కన నాతనిఁ గని గడ్డము వట్టి వేఁడుక
(॥పల్లవి॥)
గక్కన నాతనిఁ గని గడ్డము వట్టి వేఁడుక
చెక్కు నొక్కినపుడుగా చింత లెల్లఁ బాసును
(॥గక్కన॥)
యే మని దూరితినో యెంత చిత్తము నొచ్చెనో
ప్రేమాన నాతఁడు నన్ను బిలిపించఁడు
మోము చూచి తనకు నేమొక్కే నన్నా నిందురాఁడు
ఆమని విరహతాప మడ్డ మేల వున్నదే
(॥గక్కన॥)
పాదము లొత్త నైతినో పంత మేమి యెంచినాఁడో
నాదెస చూడఁ జెలి నైనా నంపఁడు
ఆదరించి వచ్చే నంటే నట్టె తెల్లవారదు
సాదించి నావలపులే చలముతో నున్నవి
(॥గక్కన॥)
నివ్వెరగుతో నుంటినో నెప మేమి గలిగెనో
నవుచుఁ గాఁగిట నించి నాలి సేసీని
యివ్వల శ్రీవెంకటేశుఁడే నలమేలుమంగ
నువ్విళ్లూర నన్నుఁ గూడె నొద్దెనె దాఁగీని
(||pallavi||)
gakkana nādanim̐ gani gaḍḍamu vaṭṭi vem̐ḍuga
sĕkku nŏkkinabuḍugā siṁta lĕllam̐ bāsunu
(||gakkana||)
ye mani dūridino yĕṁta sittamu nŏchchĕno
premāna nādam̐ḍu nannu bilibiṁcham̐ḍu
momu sūsi tanagu nemŏkke nannā niṁdurām̐ḍu
āmani virahadāba maḍḍa mela vunnade
(||gakkana||)
pādamu lŏtta naidino paṁta memi yĕṁchinām̐ḍo
nādĕsa sūḍam̐ jĕli nainā naṁpam̐ḍu
ādariṁchi vachche naṁṭe naṭṭĕ tĕllavāradu
sādiṁchi nāvalabule salamudo nunnavi
(||gakkana||)
nivvĕragudo nuṁṭino nĕba memi galigĕno
navusum̐ gām̐giḍa niṁchi nāli sesīni
yivvala śhrīvĕṁkaḍeśhum̐ḍe nalamelumaṁga
nuvviḽlūra nannum̐ gūḍĕ nŏddĕnĕ dām̐gīni