Title (Indic)గక్కన లాలించరాదా కాఁగిట నించఁగరాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గక్కన లాలించరాదా కాఁగిట నించఁగరాదా చెక్కు చేతితో నిదెంత సిగ్గులువడేవు (॥॥) చలివాసి నీతోను సరసమాడీ నదె మొలకచన్నులు నీపై మోపీ నదె చెలఁగి చుట్టరికము చెప్పీ నింతలోన నదె చెలిఁ జూచి నీవెంత సిగ్గులువడేవు (॥॥) కడువెల్లవిరిగాను కన్నుల మొక్కీ నదె వొడిమీఁదఁగూచుండి వొరసీ నదె జడియుఁదమితో మోవిచవు లడిగీ నదె చిడుముడి నీవెంత సిగ్గులువడేవు (॥॥) చెనకుచు నిను గూడిసేవలు సేసీ నదె మనసిచ్చె నలమేలుమంగ నీ కదె ఘనుఁడ మమ్మేలితివి కందువ శ్రీ వేంకటేశ చినుకుఁజెమట నెంత సిగ్గులువడేవు English(||pallavi||) gakkana lāliṁcharādā kām̐giḍa niṁcham̐garādā sĕkku sedido nidĕṁta sigguluvaḍevu (||||) salivāsi nīdonu sarasamāḍī nadĕ mŏlagasannulu nībai mobī nadĕ sĕlam̐gi suṭṭarigamu sĕppī niṁtalona nadĕ sĕlim̐ jūsi nīvĕṁta sigguluvaḍevu (||||) kaḍuvĕllavirigānu kannula mŏkkī nadĕ vŏḍimīm̐dam̐gūsuṁḍi vŏrasī nadĕ jaḍiyum̐damido movisavu laḍigī nadĕ siḍumuḍi nīvĕṁta sigguluvaḍevu (||||) sĕnagusu ninu gūḍisevalu sesī nadĕ manasichchĕ nalamelumaṁga nī kadĕ ghanum̐ḍa mammelidivi kaṁduva śhrī veṁkaḍeśha sinugum̐jĕmaḍa nĕṁta sigguluvaḍevu