Title (Indic)బ(ప?)ండించితేఁ గలుగునా పరమాత్ముని దాస్యము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బ(ప?)ండించితేఁ గలుగునా పరమాత్ముని దాస్యము నిండుమతి నుండితేను నెరవేరుఁ గాక (॥పండి॥) బాధకు నోపనివాఁడు పాపము సేయ నేల పోది సేయఁ దొలుతేమి బుద్ధి లేదా సాదువలె నుండితేను సర్వేశ్వరుఁడె తన్ను వాదులాట లెల్ల మాన్పి వహించుకో లేఁడా (॥పండి॥) దండుగ కోపనివాఁడు తప్పులు సేయఁగ నేల వుండరాదా తా నుండె వొడికానను కొండవంటి యాసతోడ కోరక తా నుండితేను తండు ముండై లంపటాలు తగిలీనా తనకు (॥పండి॥) వళుకు కోపనివాఁడు వచ్చి పూఁటవడ నేల వొలిసినట్లు తనంత నుండరాదా కలకాలము శ్రీవెంకటనాథుఁ గొలిచితె అలరి యభయ మిచ్చి అట్టె కావ నోపఁడా English(||pallavi||) ba(pa?)ṁḍiṁchidem̐ galugunā paramātmuni dāsyamu niṁḍumadi nuṁḍidenu nĕraverum̐ gāga (||paṁḍi||) bādhagu nobanivām̐ḍu pābamu seya nela podi seyam̐ dŏludemi buddhi ledā sāduvalĕ nuṁḍidenu sarveśhvarum̐ḍĕ tannu vādulāḍa lĕlla mānpi vahiṁchugo lem̐ḍā (||paṁḍi||) daṁḍuga kobanivām̐ḍu tappulu seyam̐ga nela vuṁḍarādā tā nuṁḍĕ vŏḍigānanu kŏṁḍavaṁṭi yāsadoḍa koraga tā nuṁḍidenu taṁḍu muṁḍai laṁpaḍālu tagilīnā tanagu (||paṁḍi||) vaḽugu kobanivām̐ḍu vachchi pūm̐ṭavaḍa nela vŏlisinaṭlu tanaṁta nuṁḍarādā kalagālamu śhrīvĕṁkaḍanāthum̐ gŏlisidĕ alari yabhaya michchi aṭṭĕ kāva nobam̐ḍā