Baabu baabu mechchidine padamti ninnu

బాపు బాపు మెచ్చితినే పడఁతి నిన్ను
Language

(॥పల్లవి॥)
బాపు బాపు మెచ్చితినే పడఁతి నిన్ను
రేపు మాపు నితనినే మరిగించుకొంటివి

(॥బాపు॥)
సేయరానివినయాలు సేసిసేని రమణుని
చాయకుఁ దెచ్చుకొంటివి జాణవౌదువే
పాయకుండాఁ జెప్పరానిబాస సేఇంచుకొంటివి
నీయంతటి దెవ్వతె నెలఁతలలోనను

(॥బాపు॥)
కడలేనికతలును కారణాలుఁ జెప్పి పతి -
నొడఁబరు కొంటివి వొద్దికాయనే
జడియక సేవసేసి చన విప్పించుకొంటివి
కడు నీగుణములు పొగడ నెట్టు వచ్చునే

(॥బాపు॥)
పలుమారు మోవితేనెపదనులు చూపి చూపి
వెలయఁ గూడితివి శ్రీవేంకటేశ్వరు
యెలమితో నన్ను నేలె యీతఁడే అప్పటి నేఁడు
బలిమి నీతో నెట్టు పచరించవచ్చునే

(||pallavi||)
bābu bābu mĕchchidine paḍam̐ti ninnu
rebu mābu nidanine marigiṁchugŏṁṭivi

(||bābu||)
seyarānivinayālu sesiseni ramaṇuni
sāyagum̐ dĕchchugŏṁṭivi jāṇavauduve
pāyaguṁḍām̐ jĕpparānibāsa seiṁchugŏṁṭivi
nīyaṁtaḍi dĕvvadĕ nĕlam̐talalonanu

(||bābu||)
kaḍalenigadalunu kāraṇālum̐ jĕppi padi -
nŏḍam̐baru kŏṁṭivi vŏddigāyane
jaḍiyaga sevasesi sana vippiṁchugŏṁṭivi
kaḍu nīguṇamulu pŏgaḍa nĕṭṭu vachchune

(||bābu||)
palumāru movidenĕbadanulu sūbi sūbi
vĕlayam̐ gūḍidivi śhrīveṁkaḍeśhvaru
yĕlamido nannu nelĕ yīdam̐ḍe appaḍi nem̐ḍu
balimi nīdo nĕṭṭu pasariṁchavachchune