Baabu baabu mechchidine baludaanavu

బాపు బాపు మెచ్చితినే బలుదానవు
Language

(॥పల్లవి॥)
బాపు బాపు మెచ్చితినే బలుదానవు
యేపుతోడ నుండేవార మింతేసి కోసర(కోప?)మే

(॥బాపు॥)
వాసనకస్తూరి వూసి వలపుచవులు చూప
వేసరవుగదే నీవు విభునితోను
మూసినముత్తెమువలె ముంగిటనే నిలుచుండి
ఆసపడేవారము నే మంతేసి కోపమే

(॥బాపు॥)
మోవితేనె లంచమిచ్చి మొకమోడింపించుకొన
దేవరవుగదే నీవు దేవునితోను
హావభావములతోడ ఆయమంటి మన్ననలే
ఆవటించుకొనేవార మందు కొడిగట్టము

(॥బాపు॥)
గందవొడి మీఁదఁజల్లి కాఁగిలించి కూడికూడి
విందవైతిగదే శ్రీవేంకటేశుతో
అందమై ఆతఁడే కూడె అలమేలుమంగనేను
చందమైనవార మింత సాదించనెఱఁగము

(||pallavi||)
bābu bābu mĕchchidine baludānavu
yebudoḍa nuṁḍevāra miṁtesi kosara(koba?)me

(||bābu||)
vāsanagastūri vūsi valabusavulu sūba
vesaravugade nīvu vibhunidonu
mūsinamuttĕmuvalĕ muṁgiḍane nilusuṁḍi
āsabaḍevāramu ne maṁtesi kobame

(||bābu||)
movidenĕ laṁchamichchi mŏgamoḍiṁpiṁchugŏna
devaravugade nīvu devunidonu
hāvabhāvamuladoḍa āyamaṁṭi mannanale
āvaḍiṁchugŏnevāra maṁdu kŏḍigaṭṭamu

(||bābu||)
gaṁdavŏḍi mīm̐dam̐jalli kām̐giliṁchi kūḍigūḍi
viṁdavaidigade śhrīveṁkaḍeśhudo
aṁdamai ādam̐ḍe kūḍĕ alamelumaṁganenu
saṁdamainavāra miṁta sādiṁchanĕṟam̐gamu