బాపు బాపు మాతోనే పంతమేలోయి
(॥పల్లవి॥)
బాపు బాపు మాతోనే పంతమేలోయి
చేపట్టితి వింతలోనే చెల్లునోయి
(॥బాపు॥)
నల్లఁబల్లిచెన్నుఁడా నవ్వేవు సారెసారె
ఇల్లిదె చూతువు గాని యిందు రావోయి
గొల్లదోమటాయ నేఁడు కోరి నీతో సరసాలు
చల్ల వేండిసేసుకొంటే చాలులేవోయి
(॥బాపు॥)
గోపికలవిటుఁడా కొంగువట్టే వేమోయి
యీపారి చూతువుగాని ఇందురావోఇ
మూపులు మూఁడాయ నీమొక్కినమొక్కులకెల్ల
రాపైన వుప్పుగప్పురములాయనోయి
(॥బాపు॥)
నగు శ్రీవేంకటగిరి నల్లఁబల్లి చెన్నుఁడా
యెగసక్కె మిఁకనేల ఇందు రావోఇ
తగుఁదగు నీకు నాకు తనిసితి నిఁక నోయి
చిగురుఁజేవనుకొంటి చిత్తగించవోయి
(||pallavi||)
bābu bābu mādone paṁtameloyi
sebaṭṭidi viṁtalone sĕllunoyi
(||bābu||)
nallam̐ballisĕnnum̐ḍā navvevu sārĕsārĕ
illidĕ sūduvu gāni yiṁdu rāvoyi
gŏlladomaḍāya nem̐ḍu kori nīdo sarasālu
salla veṁḍisesugŏṁṭe sālulevoyi
(||bābu||)
gobigalaviḍum̐ḍā kŏṁguvaṭṭe vemoyi
yībāri sūduvugāni iṁdurāvoi
mūbulu mūm̐ḍāya nīmŏkkinamŏkkulagĕlla
rābaina vuppugappuramulāyanoyi
(||bābu||)
nagu śhrīveṁkaḍagiri nallam̐balli sĕnnum̐ḍā
yĕgasakkĕ mim̐kanela iṁdu rāvoi
tagum̐dagu nīgu nāgu tanisidi nim̐ka noyi
sigurum̐jevanugŏṁṭi sittagiṁchavoyi