Title (Indic)బాపు బాపు కృష్ణా బాలకృష్ణా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు కృష్ణా బాలకృష్ణా బాపురే నీ ప్రతాప భాగ్యము లివివో (॥బాపు॥) బాలుఁడవై రేపల్లెఁ బాలు నీ వారగించఁగ పాల జలనిధి యెంత భయపడెనో ఆలించి తొదలుమాట లాడనేరుచుకొనఁగ యీలీల ననురసతు లెంత భ్రమసిరో (॥బాపు॥) తప్పుటడుగులు నీవు ధరమీఁదఁ బెట్టఁగాను తప్పక బలీంద్రుఁ డేమి దలఁచినాఁడో అప్పుడే దాఁగిలిముచ్చు లందరితో నాడఁగాను చెప్పేటివేదాలు నిన్నుఁ జేరి యెంత నగునో (॥బాపు॥) సందడి గోపికల చంకలెక్కి వున్ననాఁడు చెంది నీ పురము మీఁది శ్రీసతి యేమనెనో విందుగ శ్రీవేంకటాద్రి విభుఁడవై యున్న నేఁడు కందువైన దేవతలఘనత యెట్టుండునో English(||pallavi||) bābu bābu kṛṣhṇā bālakṛṣhṇā bābure nī pradāba bhāgyamu livivo (||bābu||) bālum̐ḍavai reballĕm̐ bālu nī vāragiṁcham̐ga pāla jalanidhi yĕṁta bhayabaḍĕno āliṁchi tŏdalumāḍa lāḍanerusugŏnam̐ga yīlīla nanurasadu lĕṁta bhramasiro (||bābu||) tappuḍaḍugulu nīvu dharamīm̐dam̐ bĕṭṭam̐gānu tappaga balīṁdrum̐ ḍemi dalam̐sinām̐ḍo appuḍe dām̐gilimuchchu laṁdarido nāḍam̐gānu sĕppeḍivedālu ninnum̐ jeri yĕṁta naguno (||bābu||) saṁdaḍi gobigala saṁkalĕkki vunnanām̐ḍu sĕṁdi nī puramu mīm̐di śhrīsadi yemanĕno viṁduga śhrīveṁkaḍādri vibhum̐ḍavai yunna nem̐ḍu kaṁduvaina devadalaghanada yĕṭṭuṁḍuno