Title (Indic)బాపు బాపు జాణఁడా పైకొంటి నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు జాణఁడా పైకొంటి నేఁడు యేపుమీరె నా సోదమిఁక నెంత నేఁడు (॥బాపు॥) శిరసు నెత్తి తివి చెక్కూ నొక్కితివి అరయ నీ కొక్కమన సాయఁగా నేఁడు వెరవు చూపితివి వెన్నెలనవ్వు నవ్వితి వరిది నొక్కమన సాయఁగా నేఁడు (॥బాపు॥) బొమ్మల జంకించితివి బూతునఁ దిట్టితివి అమ్మరో నీకోరినట్టె ఆయఁగా నేఁడు తమ్ములము వెట్టితివి దక్కఁగ మోవిచ్చితివి అమ్ముడువలపు సతమాయఁగా నేఁడు (॥బాపు॥) గక్కునఁ గూడితివి కన్నులఁ జొక్కితివి అక్కరఁ దనివి నీ కాయఁగా నేఁడు గక్కున శ్రీవేంకటేశ కలకాలమెల్ల నన్ను అక్కున నిలిపితివి అరుదాయ నేఁడు English(||pallavi||) bābu bābu jāṇam̐ḍā paigŏṁṭi nem̐ḍu yebumīrĕ nā sodamim̐ka nĕṁta nem̐ḍu (||bābu||) śhirasu nĕtti tivi sĕkkū nŏkkidivi araya nī kŏkkamana sāyam̐gā nem̐ḍu vĕravu sūbidivi vĕnnĕlanavvu navvidi varidi nŏkkamana sāyam̐gā nem̐ḍu (||bābu||) bŏmmala jaṁkiṁchidivi būdunam̐ diṭṭidivi ammaro nīgorinaṭṭĕ āyam̐gā nem̐ḍu tammulamu vĕṭṭidivi dakkam̐ga movichchidivi ammuḍuvalabu sadamāyam̐gā nem̐ḍu (||bābu||) gakkunam̐ gūḍidivi kannulam̐ jŏkkidivi akkaram̐ danivi nī kāyam̐gā nem̐ḍu gakkuna śhrīveṁkaḍeśha kalagālamĕlla nannu akkuna nilibidivi arudāya nem̐ḍu