బాపు బాపు జాణ గదే బావఁగారు
(॥పల్లవి॥)
బాపు బాపు జాణ గదే బావఁగారు
కోపగించీ నోప నంటే గోల బావఁగారు
(॥బాప॥)
చనవు సేసుక నాతో సారె సారె నవ్వీని
పని లేదు తన కేమి బావఁగారు
వినరె మాటల నుప్పు వేసి పొత్తు గలసీని
పెనఁగి యెక్కడ నైనా పెద్దబావఁగారు
(॥బాప॥)
నయమున నా యెదుట నన్నుఁ బేరుకొని పాడి
బయలు వందిలి వెట్టీ బావఁగారు
ప్రియముతో మంచ మెక్కీ పిలివని పేరంటము
లయకాఁడు గదవే తొలఁగుబావఁగారు
(॥బాప॥)
సులభానఁ దానె మెచ్చి సోమ్ము లెల్లా మెడఁ గట్టీ
బలిమికాఁడు గదవే బావఁగారు
తొలఁగక నన్నుఁ గూడి దొరకోలు సేసుకొని
చెలఁగీ శ్రీవెంకటాద్రి చిన్నబావఁగారు
(||pallavi||)
bābu bābu jāṇa gade bāvam̐gāru
kobagiṁchī noba naṁṭe gola bāvam̐gāru
(||bāba||)
sanavu sesuga nādo sārĕ sārĕ navvīni
pani ledu tana kemi bāvam̐gāru
vinarĕ māḍala nuppu vesi pŏttu galasīni
pĕnam̐gi yĕkkaḍa nainā pĕddabāvam̐gāru
(||bāba||)
nayamuna nā yĕduḍa nannum̐ berugŏni pāḍi
bayalu vaṁdili vĕṭṭī bāvam̐gāru
priyamudo maṁcha mĕkkī pilivani peraṁṭamu
layagām̐ḍu gadave tŏlam̐gubāvam̐gāru
(||bāba||)
sulabhānam̐ dānĕ mĕchchi sommu lĕllā mĕḍam̐ gaṭṭī
balimigām̐ḍu gadave bāvam̐gāru
tŏlam̐gaga nannum̐ gūḍi dŏragolu sesugŏni
sĕlam̐gī śhrīvĕṁkaḍādri sinnabāvam̐gāru