Title (Indic)ఆతఁ డెవ్వాఁడు చూపరే అమ్మలాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁ డెవ్వాఁడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి క్రిష్ణుఁ డీతఁడే కాఁడుగదా (॥ఆత॥) కందువ దేవకి బిడ్డఁగనెనట నడురేయి అంది యశోదకుఁ గొడుకైనాఁడట సందడించి పూతకిచంటిపాలుఁ దాగెనట మందల ఆవులఁ గాచి మలసెనట (॥ఆత॥) మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట ఇంచుకంతవేలఁ గొండయెత్తినాఁడట మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట మించులఁ బిల్లగోవివట్టి మెరసెనట (॥ఆత॥) కాళింగుని మెట్టెనట కంసుఁ బొరిగొనెనట పాలించి సురలఁ జేపట్టెనట యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుఁడట యేలెనట పదారువేలింతుల నిందరిని English(||pallavi||) ādam̐ ḍĕvvām̐ḍu sūbare ammalāla edula nāḍeḍi kriṣhṇum̐ ḍīdam̐ḍe kām̐ḍugadā (||āda||) kaṁduva devagi biḍḍam̐ganĕnaḍa naḍureyi aṁdi yaśhodagum̐ gŏḍugainām̐ḍaḍa saṁdaḍiṁchi pūdagisaṁṭibālum̐ dāgĕnaḍa maṁdala āvulam̐ gāsi malasĕnaḍa (||āda||) maṁchibaṁḍi dannĕnaḍa maddulu virisĕnaḍa iṁchugaṁtavelam̐ gŏṁḍayĕttinām̐ḍaḍa maṁchālabai gŏllĕdalamānālu segŏnĕnaḍa miṁchulam̐ billagovivaṭṭi mĕrasĕnaḍa (||āda||) kāḽiṁguni mĕṭṭĕnaḍa kaṁsum̐ bŏrigŏnĕnaḍa pāliṁchi suralam̐ jebaṭṭĕnaḍa yīlīla śhrīveṁkaḍādri niravainadevum̐ḍaḍa yelĕnaḍa padāruveliṁtula niṁdarini