Title (Indic)ఆతఁ డెంత నీవెంత ఆయఁగా మందెమేళము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁ డెంత నీవెంత ఆయఁగా మందెమేళము యేతు లాతనిముందర నెంత మెరసేవే (॥ఆత॥) అవులేవే కొప్పువిరు లాతని పై రాలఁగను చెవిలొ విన్నపాలేమి సేసేవే నీవు జవళిఁ జన్ను మొనలు సారెసారెఁ దాఁకఁగాను తివిరి కస్తూరియలఁదే విదేమే నీవు (॥ఆత॥) జోరునఁ బైఁజెమటలు జొటజొటఁ గారఁగాను చేరి వూడిగా లేమి సేసేవే నీవు గోరికొన శిరసుపై కురులలొ నూఁదుకొంటా సారెఁ గొప్పు దువ్వేవేము సందుసుడి నీవు (॥ఆత॥) అలరి నీనిట్టూరుపు లాతనిమై సోఁకఁగాను చెలఁగి మచ్చిక లేమిసేసేవే నీవు అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు వొలిసి నన్నేలె నేమి వొరసేవే నీవు English(||pallavi||) ādam̐ ḍĕṁta nīvĕṁta āyam̐gā maṁdĕmeḽamu yedu lādanimuṁdara nĕṁta mĕraseve (||āda||) avuleve kŏppuviru lādani pai rālam̐ganu sĕvilŏ vinnabālemi seseve nīvu javaḽim̐ jannu mŏnalu sārĕsārĕm̐ dām̐kam̐gānu tiviri kastūriyalam̐de videme nīvu (||āda||) jorunam̐ baim̐jĕmaḍalu jŏḍajŏḍam̐ gāram̐gānu seri vūḍigā lemi seseve nīvu gorigŏna śhirasubai kurulalŏ nūm̐dugŏṁṭā sārĕm̐ gŏppu duvvevemu saṁdusuḍi nīvu (||āda||) alari nīniṭṭūrubu lādanimai som̐kam̐gānu sĕlam̐gi machchiga lemiseseve nīvu alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu vŏlisi nannelĕ nemi vŏraseve nīvu