Title (Indic)ఆతఁ డీడనే వున్నాఁడు అడుగరే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁ డీడనే వున్నాఁడు అడుగరే నీతితోడ నన్నునేల నేరమెంచేరే (॥ఆత॥) మొగము చూచినఁగాక మోహమెట్టు గానవచ్చు నగినఁగా కెటు లామన్నన దెలుసు తగులనాడినఁగాక దగ్గర నెట్లవచ్చు నిగుడి మీరేల నన్ను నేరమెంచేరే (॥ఆత॥) మచ్చిక చల్లినఁగాక మాఁటలెట్లా నాడవచ్చు ముచ్చటలాడక యెట్లు మొక్కవచ్చును మెచ్చకతొలుతనే మేలమెట్లా నాడవచ్చు నెచ్చెలు లిందరునేల నేరమెంచేరే (॥ఆత॥) చెలిమి సేసినఁగాక చెనకఁగ నెట్టువచ్చు పిలువకతొల్లే యెట్టు పెనఁగవచ్చు అలమి శ్రీవేంకటేశుఁ డంతలోనే నన్నుఁ గూడె నెలకొని యిప్పుడేల నేరమెంచేరే English(||pallavi||) ādam̐ ḍīḍane vunnām̐ḍu aḍugare nīdidoḍa nannunela neramĕṁchere (||āda||) mŏgamu sūsinam̐gāga mohamĕṭṭu gānavachchu naginam̐gā kĕḍu lāmannana dĕlusu tagulanāḍinam̐gāga daggara nĕṭlavachchu niguḍi mīrela nannu neramĕṁchere (||āda||) machchiga sallinam̐gāga mām̐ṭalĕṭlā nāḍavachchu muchchaḍalāḍaga yĕṭlu mŏkkavachchunu mĕchchagadŏludane melamĕṭlā nāḍavachchu nĕchchĕlu liṁdarunela neramĕṁchere (||āda||) sĕlimi sesinam̐gāga sĕnagam̐ga nĕṭṭuvachchu piluvagadŏlle yĕṭṭu pĕnam̐gavachchu alami śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalone nannum̐ gūḍĕ nĕlagŏni yippuḍela neramĕṁchere