Title (Indic)ఆతఁ డంపిననే గాక నందాఁకాఁ బదర నేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁ డంపిననే గాక నందాఁకాఁ బదర నేల నీతి గాదు మొదలనే నీకుఁ గోప మేటికీ (॥ఆత॥) మొక్కితే నేమాయనే మోహపుఁ బతికీవేళ మొక్కిన చేయిగోరిమీఁద ముక్క పోయీనా నిక్కి ప్రియముచెప్పితే నేఁటిలో నేమాయనే దిక్కన కప్రపునోరఁ దినరాదా కారము (॥ఆత॥) కన్నుల నవ్వితే నేమే కపటాలు గంటేను ఆ కన్నులచే కాఁక చల్లఁ గా దనేరా సన్నల మెచ్చితే నేమే సరవి దప్పినవేళ సన్నసేసినపతిని జంకించరాదా (॥ఆత॥) కౌఁగిట నించితే నేమే గర్వము చూపినవేళ కౌఁగిటి రతులలోనే కరఁచ రాదా పాఁగిన శ్రీవేంకటాద్రిపతి నన్ను నిట్టే కూడె వీఁగ నలమేల్మంగను వెఱగంద రాదా English(||pallavi||) ādam̐ ḍaṁpinane gāga naṁdām̐kām̐ badara nela nīdi gādu mŏdalane nīgum̐ goba meḍigī (||āda||) mŏkkide nemāyane mohabum̐ badigīveḽa mŏkkina seyigorimīm̐da mukka poyīnā nikki priyamusĕppide nem̐ṭilo nemāyane dikkana kaprabunoram̐ dinarādā kāramu (||āda||) kannula navvide neme kabaḍālu gaṁṭenu ā kannulase kām̐ka sallam̐ gā danerā sannala mĕchchide neme saravi dappinaveḽa sannasesinabadini jaṁkiṁcharādā (||āda||) kaum̐giḍa niṁchide neme garvamu sūbinaveḽa kaum̐giḍi radulalone karam̐sa rādā pām̐gina śhrīveṁkaḍādribadi nannu niṭṭe kūḍĕ vīm̐ga nalamelmaṁganu vĕṟagaṁda rādā