Title (Indic)ఆతఁ డదె నే నిదె ఆసలు మిగిలెను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁ డదె నే నిదె ఆసలు మిగిలెను మతకము మాన్పరే మన్నన చెలులూ (॥ఆతఁ॥) తిరమగునామాఁట తేనెలు గురియఁగ తరితీపు లీతఁడు తాఁ గురిసె సరి మాలో మొగచాటులాయ నిదె వెరవులు చెప్పరే వేడుకచెలులూ (॥ఆతఁ॥) కొనచూపుల నే కుంకుమ చల్లఁగ వొనరఁదా నవ్వుపువ్వులు చల్లె యినుమడించి మాకివె చలువలాయ పొనుగక చెప్పరే బుద్దులు చెలులూ (॥ఆతఁ॥) వావిరి నా కిదె వలపులు గూడఁగ శ్రీవేంకటేశుఁడు జిగిఁ గూడె బావము లిందునే బడిఁ దగులాయను యీవల మెచ్చరే యిదివో చెలులూ English(||pallavi||) ādam̐ ḍadĕ ne nidĕ āsalu migilĕnu madagamu mānpare mannana sĕlulū (||ādam̐||) tiramagunāmām̐ṭa tenĕlu guriyam̐ga taridību līdam̐ḍu tām̐ gurisĕ sari mālo mŏgasāḍulāya nidĕ vĕravulu sĕppare veḍugasĕlulū (||ādam̐||) kŏnasūbula ne kuṁkuma sallam̐ga vŏnaram̐dā navvubuvvulu sallĕ yinumaḍiṁchi māgivĕ saluvalāya pŏnugaga sĕppare buddulu sĕlulū (||ādam̐||) vāviri nā kidĕ valabulu gūḍam̐ga śhrīveṁkaḍeśhum̐ḍu jigim̐ gūḍĕ bāvamu liṁdune baḍim̐ dagulāyanu yīvala mĕchchare yidivo sĕlulū