Title (Indic)ఆడకుఁ బోయిరావయ్యా అన్నీ విన్నవించేఁగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడకుఁ బోయిరావయ్యా అన్నీ విన్నవించేఁగాని యీడ మాతోడి పొందులు యేకాలముఁ గలవే (॥ఆడ॥) చిత్తము రంజిల్ల నీవే చెప్పినట్టల్లాఁ జేసి మెత్తనిమాట లాడి మెప్పించె నాపె గుత్తపు గుబ్బలు పోఁక కొప్పు నీకుఁ జక్కఁబెట్టి చిత్తజకేళికి నిన్నుఁ జిమ్మిరేఁచె నాపె (॥ఆడ॥) తనపైఁ బరాకుసేసి తమి నీకు బుట్టించి వినయములనే దక్కఁగొనె నిన్నాపె కొనగోలు మోవ చెక్కుఁలను జవ్వాది మెత్తి కనుసన్న రతులకుఁ గైకొలిపె నాపె (॥ఆడ॥) తెమఱఁగుకుఁ దీసి తియ్యనిమోవి యొసగి మరిగించె నలమేలుమంగే యాపె గరిమ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను సరసపునవ్వులు చవిచూపె నాపె English(||pallavi||) āḍagum̐ boyirāvayyā annī vinnaviṁchem̐gāni yīḍa mādoḍi pŏṁdulu yegālamum̐ galave (||āḍa||) sittamu raṁjilla nīve sĕppinaṭṭallām̐ jesi mĕttanimāḍa lāḍi mĕppiṁchĕ nābĕ guttabu gubbalu pom̐ka kŏppu nīgum̐ jakkam̐bĕṭṭi sittajageḽigi ninnum̐ jimmirem̐sĕ nābĕ (||āḍa||) tanabaim̐ barāgusesi tami nīgu buṭṭiṁchi vinayamulane dakkam̐gŏnĕ ninnābĕ kŏnagolu mova sĕkkum̐lanu javvādi mĕtti kanusanna radulagum̐ gaigŏlibĕ nābĕ (||āḍa||) tĕmaṟam̐gugum̐ dīsi tiyyanimovi yŏsagi marigiṁchĕ nalamelumaṁge yābĕ garima śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu sarasabunavvulu savisūbĕ nābĕ