Title (Indic)ఆడకేల మమ్ముఁ బిల్చీననరే వో చెలులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడకేల మమ్ముఁ బిల్చీననరే వో చెలులాల వేడుకమాటలాడ వెస మీరు చాలరా (॥ఆడ॥) కందువ నాపెఁ దాను కాఁగిలించుకుండఁగాను చెంది సతు లెవ్వ రెట్టు సేవసేసేరు యిందుకు రమ్మనవే యేపనులు గలిగినా అంది సేసేయు సిగ్గరిఆఁడువారము (॥ఆడ॥) మునుపుపాన్పుపైఁదాముముసుగువెట్టుకుండఁగా యెనసి యెవ్వరు విడెమియ్యవచ్చేరు చెనకి మావద్దికిఁ జేఇ చాఁచుమనవే ఘనమైనర వాసివన్నె గలవారము (॥ఆడ॥) మేలి మలమేల్ మంగను మెడఁగట్టుకుండఁగాను కాలుదొక్కి యెవ్వరెట్టు కలసేరు యేలినాఁడు శ్రీవేంకటేశుఁ డింతలోనె మమ్ము వోలిఁ దాము) మన్నించఁగా నుండేటివారము English(||pallavi||) āḍagela mammum̐ bilsīnanare vo sĕlulāla veḍugamāḍalāḍa vĕsa mīru sālarā (||āḍa||) kaṁduva nābĕm̐ dānu kām̐giliṁchuguṁḍam̐gānu sĕṁdi sadu lĕvva rĕṭṭu sevaseseru yiṁdugu rammanave yebanulu galiginā aṁdi seseyu siggariām̐ḍuvāramu (||āḍa||) munububānpubaim̐dāmumusuguvĕṭṭuguṁḍam̐gā yĕnasi yĕvvaru viḍĕmiyyavachcheru sĕnagi māvaddigim̐ jei sām̐sumanave ghanamainara vāsivannĕ galavāramu (||āḍa||) meli malamel maṁganu mĕḍam̐gaṭṭuguṁḍam̐gānu kāludŏkki yĕvvarĕṭṭu kalaseru yelinām̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ mammu volim̐ dāmu) manniṁcham̐gā nuṁḍeḍivāramu