Title (Indic)ఆడకే నే వచ్చినప్పు డయ్యీఁ గాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడకే నే వచ్చినప్పు డయ్యీఁ గాని బూడిద వసంతమాడఁ బొమ్మనవే వానిని (॥॥) వలపు జాతెఱఁగదు వాసి నీతి యెఱఁగదు కలిమి ముందువెనక గాననియ్యదు తెలిసితేఁ బసలేదు దిష్టమాయ మాకిన్ని పొలసి కొసరనేల పొమ్మనవే వానిని (॥॥) కోపము దయయెఱఁగదు కూటమి సిగ్గెఱఁగదు తీపులమోవి దప్పితీరనియ్యదు రాఁపునేయఁ బనిలేదు రచ్చకెక్కఁ బనులెల్లా పోపో అదేడసుద్ది పొమ్మనవే వానిని (॥॥) పాయము భీతెఱఁగదు పంతము తన్నెఱఁగదు చాయలసన్నలముద్దు చవెఱఁగదు యీయెడ శ్రీవేంకటేశుఁ డిపు డిట్టె నన్నుఁ గూడె పోయి ఇట్టేవచ్చీఁగాని పొమ్మనవే వానిని English(||pallavi||) āḍage ne vachchinappu ḍayyīm̐ gāni būḍida vasaṁtamāḍam̐ bŏmmanave vānini (||||) valabu jādĕṟam̐gadu vāsi nīdi yĕṟam̐gadu kalimi muṁduvĕnaga gānaniyyadu tĕlisidem̐ basaledu diṣhṭamāya māginni pŏlasi kŏsaranela pŏmmanave vānini (||||) kobamu dayayĕṟam̐gadu kūḍami siggĕṟam̐gadu tībulamovi dappidīraniyyadu rām̐puneyam̐ baniledu rachchagĕkkam̐ banulĕllā pobo adeḍasuddi pŏmmanave vānini (||||) pāyamu bhīdĕṟam̐gadu paṁtamu tannĕṟam̐gadu sāyalasannalamuddu savĕṟam̐gadu yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍibu ḍiṭṭĕ nannum̐ gūḍĕ poyi iṭṭevachchīm̐gāni pŏmmanave vānini