Title (Indic)ఆతడాఁ యీతఁడు పెద్దహనుమంతుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతడాఁ యీతఁడు పెద్దహనుమంతుఁడు చేతులారా నక్షునిఁ జెండివేసినాఁడట (॥ఆతడాఁ॥) తొలుత రాముని గాంచి తోడనే సుగ్రీవుని కొలువఁ బెట్టి యాతనికొమ్మ నిప్పించి జలనిధి దాఁటి లంక సాధించి చొచ్చి సీతకు- నలర నుంగర మిచ్చె నతిసాహసమున (॥ఆతడాఁ॥) సీతాదేవి యానవాలు శ్రీరామునికి నిచ్చి నీతి విభీషణుని మన్నించఁజేసి చేతులనే పోట్లాడి చెండివేసి రాక్షసుల ఘాతల సంజీవికొండ గక్కనఁ దాఁ దెచ్చెను (॥ఆతడాఁ॥) గక్కన రావణుఁ గొట్టి కాంతను రాముని గూర్చి అక్కడ నయోధ్యఁ బట్ట మటుగట్టి నిక్కి కలశాపురిని నిండి శ్రీవేంకటాద్రిని వుక్కమీరి హరిఁగొల్చి వున్నాఁడు వేడుకల English(||pallavi||) ādaḍām̐ yīdam̐ḍu pĕddahanumaṁtum̐ḍu sedulārā nakṣhunim̐ jĕṁḍivesinām̐ḍaḍa (||ādaḍām̐||) tŏluda rāmuni gāṁchi toḍane sugrīvuni kŏluvam̐ bĕṭṭi yādanigŏmma nippiṁchi jalanidhi dām̐ṭi laṁka sādhiṁchi sŏchchi sīdagu- nalara nuṁgara michchĕ nadisāhasamuna (||ādaḍām̐||) sīdādevi yānavālu śhrīrāmunigi nichchi nīdi vibhīṣhaṇuni manniṁcham̐jesi sedulane poṭlāḍi sĕṁḍivesi rākṣhasula ghādala saṁjīvigŏṁḍa gakkanam̐ dām̐ dĕchchĕnu (||ādaḍām̐||) gakkana rāvaṇum̐ gŏṭṭi kāṁtanu rāmuni gūrsi akkaḍa nayodhyam̐ baṭṭa maḍugaṭṭi nikki kalaśhāburini niṁḍi śhrīveṁkaḍādrini vukkamīri harim̐gŏlsi vunnām̐ḍu veḍugala