Title (Indic)ఆట యెవ్వరికిఁ గొర నేను అంతర్యామికి కాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆట యెవ్వరికిఁ గొర నేను అంతర్యామికి కాక తటుకున నితఁడే గతి యని యున్నాఁడ తప్పక నను మన్నించీఁ గాక (॥ఆట॥) హరిదాసానుదాఁసుడ నట నా కాచార్యత్వము సంగతులా అరుదుగ విష్ణుయచ్చు మోచుకొని యన్యులఁ గొలిచిననమ్ముదురా విరతి బొంది యిఁక విషయము గోరిన వెనకటి పగ లివి సాధించవా యిరవున నే మొరవెట్టఁగ నిటు నా యేలిక దానే కాచీఁ గాక (॥ఆట॥) సకలపుణ్యముల ఫలము లొల్ల నని స్వర్గము చొరనిఁకఁ బాడి యౌనా ఆకటా తిరుమంత్రము నుడువునోరధములఁ బొగడఁగజవి యౌనా వికటపు మోహమున నరకెద నని భావించి పారితే వెను కొనదా మొకమెదుటనె వేలుచు నుండఁగ మురహరుఁడే దయఁజూచీఁగాక (॥ఆట॥) శ్రీవైష్ణవధర్మము చేపట్టి జిగిఁ బిరికితిన మిది యేల దేవతాంతరము మాని కమ్మటి తెరువు దప్పహీనము గాదా వేవేలు చదువులు చదివి ప్రాకృతుల వేఁడుచుఁ దిరిగినను నవ్వరా శ్రీవేంకటేశుఁడే గతియని యుండఁగ చేరితఁడే రక్షించీఁ గాక English(||pallavi||) āḍa yĕvvarigim̐ gŏra nenu aṁtaryāmigi kāga taḍuguna nidam̐ḍe gadi yani yunnām̐ḍa tappaga nanu manniṁchīm̐ gāga (||āḍa||) haridāsānudām̐suḍa naḍa nā kāsāryatvamu saṁgadulā aruduga viṣhṇuyachchu mosugŏni yanyulam̐ gŏlisinanammudurā viradi bŏṁdi yim̐ka viṣhayamu gorina vĕnagaḍi paga livi sādhiṁchavā yiravuna ne mŏravĕṭṭam̐ga niḍu nā yeliga dāne kāsīm̐ gāga (||āḍa||) sagalabuṇyamula phalamu lŏlla nani svargamu sŏranim̐kam̐ bāḍi yaunā āgaḍā tirumaṁtramu nuḍuvunoradhamulam̐ bŏgaḍam̐gajavi yaunā vigaḍabu mohamuna naragĕda nani bhāviṁchi pāride vĕnu kŏnadā mŏgamĕduḍanĕ velusu nuṁḍam̐ga muraharum̐ḍe dayam̐jūsīm̐gāga (||āḍa||) śhrīvaiṣhṇavadharmamu sebaṭṭi jigim̐ birigidina midi yela devadāṁtaramu māni kammaḍi tĕruvu dappahīnamu gādā vevelu saduvulu sadivi prākṛtula vem̐ḍusum̐ diriginanu navvarā śhrīveṁkaḍeśhum̐ḍe gadiyani yuṁḍam̐ga seridam̐ḍe rakṣhiṁchīm̐ gāga