Title (Indic)ఆడ కేల పిలిచేవే అప్పటి నన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడ కేల పిలిచేవే అప్పటి నన్ను గోడ గడుఁగఁగ నేల గొబ్బున రాఁ గదవే (॥ఆడ కేల॥) లోఁతఁకు జొచ్చినవాఁడు లోన నీమాట వినీనా మూఁతి మీఁది కెత్తేవాఁడు మోము చూచీనా చేఁతలు దవ్వెటివాఁడు సిగ్గు వడ నేరుచునా పాఁతుమా కై వుండేవాఁడు పైకొనీనా (॥ఆడ కేల॥) పెచ్చు వెరిగెటివాఁడు ప్రియము చేకొనునా మచ్చరమే పెంచేవాఁడు మన సిచ్చీనా వొచ్చెము వెదకేవాఁడు వొగి నిజ మెరుఁగునా యెచ్చు కుందు చేఁతవాఁడు యిత వై చూచీనా (॥ఆడ కేల॥) సటల మాటలవాఁడు సరవిగా నడచీనా కుటిలపుగతివాఁడు గుట్టు చెప్పీనా యిటు శ్రీవెంకటేశుఁడు యీమాటకే నన్నుఁ గూడె యిటువలె నుండినామ యింకఁ బాసీనా English(||pallavi||) āḍa kela piliseve appaḍi nannu goḍa gaḍum̐gam̐ga nela gŏbbuna rām̐ gadave (||āḍa kela||) lom̐tam̐ku jŏchchinavām̐ḍu lona nīmāḍa vinīnā mūm̐ti mīm̐di kĕttevām̐ḍu momu sūsīnā sem̐talu davvĕḍivām̐ḍu siggu vaḍa nerusunā pām̐tumā kai vuṁḍevām̐ḍu paigŏnīnā (||āḍa kela||) pĕchchu vĕrigĕḍivām̐ḍu priyamu segŏnunā machcharame pĕṁchevām̐ḍu mana sichchīnā vŏchchĕmu vĕdagevām̐ḍu vŏgi nija mĕrum̐gunā yĕchchu kuṁdu sem̐tavām̐ḍu yida vai sūsīnā (||āḍa kela||) saḍala māḍalavām̐ḍu saravigā naḍasīnā kuḍilabugadivām̐ḍu guṭṭu sĕppīnā yiḍu śhrīvĕṁkaḍeśhum̐ḍu yīmāḍage nannum̐ gūḍĕ yiḍuvalĕ nuṁḍināma yiṁkam̐ bāsīnā