Title (Indic)ఆపెకు నీకుఁ దెలుసు నంతరంగపు సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపెకు నీకుఁ దెలుసు నంతరంగపు సుద్దులు కోపగించఁ బనిలేదు గోవిందరాజ (॥ఆపె॥) యెంత చనవిచ్చితివో యీపెకు నీవు నేఁడు వంతులు వాసులుఁ బట్టీ వడిగా నీతో పంతగత్తె గానోపు పలుమారు నీకె నిన్ను కొంతపుఁ జూపులఁ జూచీ గోవిందరాజ (॥ఆపె॥) యేరీతి వొడఁబాటో యీకెనీసందిఁ దొల్లి మేరతో మాటాడి మందెమేళముఁ జూపీ నేరుపరి గాఁబోలు నిన్నుఁ గుడుఁబచారించి కూరిములు గొసరీని గోవిందరాజ (॥ఆపె॥) బాసలేమి సేసితివో పలుమారు నీకె నీతో రాసికెక్కఁ గూడి మేరలు మీరీని వేసాలది గాఁబోలు శ్రీవేంకటాద్రి నన్నేలఁగా గోస నాసచేసీని గోవిందరాజ English(||pallavi||) ābĕgu nīgum̐ dĕlusu naṁtaraṁgabu suddulu kobagiṁcham̐ baniledu goviṁdarāja (||ābĕ||) yĕṁta sanavichchidivo yībĕgu nīvu nem̐ḍu vaṁtulu vāsulum̐ baṭṭī vaḍigā nīdo paṁtagattĕ gānobu palumāru nīgĕ ninnu kŏṁtabum̐ jūbulam̐ jūsī goviṁdarāja (||ābĕ||) yerīdi vŏḍam̐bāḍo yīgĕnīsaṁdim̐ dŏlli merado māḍāḍi maṁdĕmeḽamum̐ jūbī nerubari gām̐bolu ninnum̐ guḍum̐basāriṁchi kūrimulu gŏsarīni goviṁdarāja (||ābĕ||) bāsalemi sesidivo palumāru nīgĕ nīdo rāsigĕkkam̐ gūḍi meralu mīrīni vesāladi gām̐bolu śhrīveṁkaḍādri nannelam̐gā gosa nāsasesīni goviṁdarāja