Title (Indic)ఆపెకంటె నీవెక్కుడు ఆపె తొల్లె నీకెక్కుడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపెకంటె నీవెక్కుడు ఆపె తొల్లె నీకెక్కుడు చేపట్టి చెలి మొక్కఁగా చెనకేవు నీవు (॥॥) కన్నులనే సన్న సేసి కాఁకలు నీపైఁ బూసి మిన్నక పరాకుసేసి మెలుఁత చన్నులపైఁజేయి చాఁపి సంగతి నిట్టూర్పు లాఁపి వున్నతి వలపు చల్లి వొరసేవు నీవు (॥॥) మాటలనే పొద్దువుచ్చి మచ్చిక నీపైఁగుచ్చి కూటముల నవ్వు దచ్చీ కోమలి నీటులనే మేనువెంచి నేరుపలనే మించి పూఁటవూఁటకుఁగొసరి పొదిగేవు నీవు (॥॥) కడుఁదమకాన మొక్కి కాఁగిటిలోపలఁజొక్కి అడరి కాలుదొక్కీ నంగన విడువక రతిఁబొంది వెస మోవితేనె చింది కడఁగి శ్రీ వేంకటేశ కైకొనేవు నీవు English(||pallavi||) ābĕgaṁṭĕ nīvĕkkuḍu ābĕ tŏllĕ nīgĕkkuḍu sebaṭṭi sĕli mŏkkam̐gā sĕnagevu nīvu (||||) kannulane sanna sesi kām̐kalu nībaim̐ būsi minnaga parāgusesi mĕlum̐ta sannulabaim̐jeyi sām̐pi saṁgadi niṭṭūrbu lām̐pi vunnadi valabu salli vŏrasevu nīvu (||||) māḍalane pŏdduvuchchi machchiga nībaim̐guchchi kūḍamula navvu dachchī komali nīḍulane menuvĕṁchi nerubalane miṁchi pūm̐ṭavūm̐ṭagum̐gŏsari pŏdigevu nīvu (||||) kaḍum̐damagāna mŏkki kām̐giḍilobalam̐jŏkki aḍari kāludŏkkī naṁgana viḍuvaga radim̐bŏṁdi vĕsa movidenĕ siṁdi kaḍam̐gi śhrī veṁkaḍeśha kaigŏnevu nīvu