Title (Indic)ఆపె వంకఁ గడవలే దన్నియు నీమహిమలే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె వంకఁ గడవలే దన్నియు నీమహిమలే కాఁపురము సేసే యింతి గర్వించవలదా (॥ఆపె॥) మన్నించి యీకెతో నీవు మంతనము లాడఁగాను వున్నతిఁ బీఁటపై బెట్టుకుండఁగాను చన్నులంటి యప్పటిని సరసములాడఁగాను కన్నులకలికి యీపె గర్వించవలదా (॥ఆపె॥) సారెసారె యాపె మోవిచవి నీవు గొనఁగాను నేరుపరితనాలెల్లా నీవెంచఁగాను కోరి మేలువాడవై గుణాలు వొగడఁగాను గారవపు జవరాలు గర్వించవలదా (॥ఆపె॥) పచ్చిగా నీవాపెతోను పకపక నవ్వఁగాను కుచ్చి కాఁగిటను నీవు గూడఁగాను ఇచ్చట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు కచ్చుపెట్టి చూచి కాంత గర్వించవలదా English(||pallavi||) ābĕ vaṁkam̐ gaḍavale danniyu nīmahimale kām̐puramu sese yiṁti garviṁchavaladā (||ābĕ||) manniṁchi yīgĕdo nīvu maṁtanamu lāḍam̐gānu vunnadim̐ bīm̐ṭabai bĕṭṭuguṁḍam̐gānu sannulaṁṭi yappaḍini sarasamulāḍam̐gānu kannulagaligi yībĕ garviṁchavaladā (||ābĕ||) sārĕsārĕ yābĕ movisavi nīvu gŏnam̐gānu nerubaridanālĕllā nīvĕṁcham̐gānu kori meluvāḍavai guṇālu vŏgaḍam̐gānu gāravabu javarālu garviṁchavaladā (||ābĕ||) pachchigā nīvābĕdonu pagabaga navvam̐gānu kuchchi kām̐giḍanu nīvu gūḍam̐gānu ichchaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu kachchubĕṭṭi sūsi kāṁta garviṁchavaladā