Title (Indic)ఆపె వచ్చినప్పు డన్నీ నయ్యీఁగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె వచ్చినప్పు డన్నీ నయ్యీఁగాని వోపుదునా దొరవు నీ వొగిఁ గాచుకుండను (॥ఆపె॥) పిలిచే వాకెను నీవు ప్రియపడి; నేనైనాఁ జెలిమారు సేవచేసేఁ జెప్పవయ్యా అలఁదేణఁ(నం?) టా గంద మట్టె చేఁబట్టుకున్నాఁడ వలరి నావురముపై నందాఁకా దాఁదవయ్యా (॥ఆపె॥) వెదకే వాపెను నీవు; వేడుకతో నే నుందాన యెదుట; నాపని యానతియ్యవయ్యా ఇది విడె మాకెకు మీఁదెత్తుకొన్నాఁడ; వందాఁకా పొదిగి నాపుక్కిట నిప్పు డుండనీవయ్యా (॥ఆపె॥) చూచే వాపె కెదురు; సుద్దులు నేఁ జెప్పేను చేచేత నీవెట్టయినాఁ జెనకవయ్యా యేచి శ్రీవేంకటేశుఁడ యే నల మేలుమంగను కాచి నన్నేలితివి ఆకాంతమారే నేనయ్యా English(||pallavi||) ābĕ vachchinappu ḍannī nayyīm̐gāni vobudunā dŏravu nī vŏgim̐ gāsuguṁḍanu (||ābĕ||) pilise vāgĕnu nīvu priyabaḍi; nenainām̐ jĕlimāru sevasesem̐ jĕppavayyā alam̐deṇam̐(naṁ?) ṭā gaṁda maṭṭĕ sem̐baṭṭugunnām̐ḍa valari nāvuramubai naṁdām̐kā dām̐davayyā (||ābĕ||) vĕdage vābĕnu nīvu; veḍugado ne nuṁdāna yĕduḍa; nābani yānadiyyavayyā idi viḍĕ māgĕgu mīm̐dĕttugŏnnām̐ḍa; vaṁdām̐kā pŏdigi nābukkiḍa nippu ḍuṁḍanīvayyā (||ābĕ||) sūse vābĕ kĕduru; suddulu nem̐ jĕppenu seseda nīvĕṭṭayinām̐ jĕnagavayyā yesi śhrīveṁkaḍeśhum̐ḍa ye nala melumaṁganu kāsi nannelidivi āgāṁtamāre nenayyā