Title (Indic)ఆపె వచ్చె అవునో కాదో అడుగవయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె వచ్చె అవునో కాదో అడుగవయ్య యే పొద్దాయ జాగుల మమ్మేల పెట్టేవయ్యా (॥ఆపె॥) తప్పక చూచితేనే తలఁపెల్లఁ గానరాదా చెప్పవలెనా నీచేఁతలెల్లాను కుప్పళించె పెంజెమట గుబ్బన తురుము వీడె దప్పిగొంటి నీసుద్దు లెందాఁక విందునయ్యా (॥ఆపె॥) వద్దఁగూచుండి నంతనే వలపెల్లఁ గానరాదా ముద్దుమోము చూపి మాకు మొక్కవలెనా చద్ది నిట్టూర్పులు రేఁగె జవ్వనము వేఁకమాయ వద్దన వెఱతు నే నెవ్వరికిఁగానయ్యా (॥ఆపె॥) నిలుచుక వుండితేనే నిజమెల్ల గానరాదా చెలరేఁగి సత్యమును సేయవలెనా నెలవై శ్రీ వేంకటేశ నీవే నన్నుఁగూడితివి అలసితి వీడెమిచ్చే నందుకొనవయ్యా English(||pallavi||) ābĕ vachchĕ avuno kādo aḍugavayya ye pŏddāya jāgula mammela pĕṭṭevayyā (||ābĕ||) tappaga sūsidene talam̐pĕllam̐ gānarādā sĕppavalĕnā nīsem̐talĕllānu kuppaḽiṁchĕ pĕṁjĕmaḍa gubbana turumu vīḍĕ dappigŏṁṭi nīsuddu lĕṁdām̐ka viṁdunayyā (||ābĕ||) vaddam̐gūsuṁḍi naṁtane valabĕllam̐ gānarādā muddumomu sūbi māgu mŏkkavalĕnā saddi niṭṭūrbulu rem̐gĕ javvanamu vem̐kamāya vaddana vĕṟadu ne nĕvvarigim̐gānayyā (||ābĕ||) nilusuga vuṁḍidene nijamĕlla gānarādā sĕlarem̐gi satyamunu seyavalĕnā nĕlavai śhrī veṁkaḍeśha nīve nannum̐gūḍidivi alasidi vīḍĕmichche naṁdugŏnavayyā