Title (Indic)ఆపె చెప్పినట్టె సేసి యాదరించఁదగు నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె చెప్పినట్టె సేసి యాదరించఁదగు నీకు కాఁపురము లీడేరెఁ గరుణించవయ్యా (॥ఆపె॥) అందెలుఁ బాయవట్టాలు అట్టె గల్లు గల్లనఁగ యిందుముఖి వచ్చెను నీ యింటికి నేఁడు గందము బేంట్లు మేనఁ గమ్ముకొని రాఁగాను ముందుగానే చేతులెత్తి మొక్కీ నీకు నిపుడు (॥ఆపె॥) కట్టిన చెంగావి చీరఁ గళబెళమనఁగాను చుట్టమై బాగాలు దెచ్చె సూడిదెగాను గట్టి కొప్పలో విరులు కడు బుగులుకొనఁగా గుట్టుతోడ నీ సంగడిఁ గూచున్న దిపుడు (॥ఆపె॥) చన్ను మెరుఁగులు నీపై సారెఁ జౌకళించఁగాను యెన్నికగాఁ గాఁగిలించె నింపులు రేఁగ మన్నించి శ్రీవేంకటేశ మరి నన్ను నేలఁగాను సన్నలనే మోవి చూపీ చవితోఁ దా నిపుడు English(||pallavi||) ābĕ sĕppinaṭṭĕ sesi yādariṁcham̐dagu nīgu kām̐puramu līḍerĕm̐ garuṇiṁchavayyā (||ābĕ||) aṁdĕlum̐ bāyavaṭṭālu aṭṭĕ gallu gallanam̐ga yiṁdumukhi vachchĕnu nī yiṁṭigi nem̐ḍu gaṁdamu beṁṭlu menam̐ gammugŏni rām̐gānu muṁdugāne sedulĕtti mŏkkī nīgu nibuḍu (||ābĕ||) kaṭṭina sĕṁgāvi sīram̐ gaḽabĕḽamanam̐gānu suṭṭamai bāgālu dĕchchĕ sūḍidĕgānu gaṭṭi kŏppalo virulu kaḍu bugulugŏnam̐gā guṭṭudoḍa nī saṁgaḍim̐ gūsunna dibuḍu (||ābĕ||) sannu mĕrum̐gulu nībai sārĕm̐ jaugaḽiṁcham̐gānu yĕnnigagām̐ gām̐giliṁchĕ niṁpulu rem̐ga manniṁchi śhrīveṁkaḍeśha mari nannu nelam̐gānu sannalane movi sūbī savidom̐ dā nibuḍu