Title (Indic)ఆపె నిన్ను నిష్టూరము లాడఁజాలదు WorkAnnamayya songs LanguageTelugu Role Artist Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(active tab)EnglishTelugu(॥పల్లవి॥) ఆపె నిన్ను నిష్టూరము లాడఁజాలదు యేపున నేమే నీకు నెచ్చరించవలసె (॥ఆప॥) తిలకించి చూడ నేల తెల్లవారినందాఁకా మలకలమాట లేల మాపుదాఁకాను నిలుచున్న దదివో నీయెదుటనే యింతి వలసినట్లఁ జేయి వద్దనము నిన్నును (॥ఆప॥) వట్టియాసలు రేఁచేవు వలసినొల్లములను ఱట్టుగా నూరకుండే వాఱడితోడను యెట్టి ననలేక యాపె యింటిలోఁ గాచుకున్నది కట్టుకో అందలిమేలు కాదనము నిన్నును (॥ఆప॥) తీరననీనవ్వులనే తెలియనీవు నీగుట్టు నేరుపు నీప్రియములనెయ్యము బెట్టు కూరిమి శ్రీవేంకటేశ కూడితివి మాచెలిని నీరపము లాయ నిఁక నేర మెంచ నిన్నును English(||pallavi||) ābĕ ninnu niṣhṭūramu lāḍam̐jāladu yebuna neme nīgu nĕchchariṁchavalasĕ (||āba||) tilagiṁchi sūḍa nela tĕllavārinaṁdām̐kā malagalamāḍa lela mābudām̐kānu nilusunna dadivo nīyĕduḍane yiṁti valasinaṭlam̐ jeyi vaddanamu ninnunu (||āba||) vaṭṭiyāsalu rem̐sevu valasinŏllamulanu ṟaṭṭugā nūraguṁḍe vāṟaḍidoḍanu yĕṭṭi nanalega yābĕ yiṁṭilom̐ gāsugunnadi kaṭṭugo aṁdalimelu kādanamu ninnunu (||āba||) tīrananīnavvulane tĕliyanīvu nīguṭṭu nerubu nīpriyamulanĕyyamu bĕṭṭu kūrimi śhrīveṁkaḍeśha kūḍidivi māsĕlini nīrabamu lāya nim̐ka nera mĕṁcha ninnunu