Title (Indic)ఆపె నిన్ను దిద్దుకొన నయఁగారుగా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె నిన్ను దిద్దుకొన నయఁగారుగా మాపుదాఁకా నూరకున్న మత్తుడవై వుందుగా (॥ఆప॥) యింతి నీకు మోహించి యింటికి విచ్చేయఁగాఁగా రంతుల నీవలపెల్లా రచ్చకెక్కెను కాంతుఁడ యిటుగాకున్న కన్నవారివెంటనెల్లా పంతపు నీమనసిది పరచై తిరుగుఁగా (॥ఆప॥) చెలి నిన్ను బుజ్జగించి చెనకి నవ్వఁగాఁగా యిలపై నీవిటతన మెన్నిక కెక్కె లలియింతరేఁచకున్న లాగుల నీవయసెల్లా పలచనై లోలోనె పండి తాఁ గైవాలుఁగా (॥ఆప॥) నిండుఁగాఁగిటనె యాపై నేరుపరిఁ జేయఁగాఁగా దుండగవు నీచేఁతలు తుదకెక్కెను అండనె శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి రండూ నింతగాకున్న రతి చవిగాదుగా English(||pallavi||) ābĕ ninnu diddugŏna nayam̐gārugā mābudām̐kā nūragunna mattuḍavai vuṁdugā (||āba||) yiṁti nīgu mohiṁchi yiṁṭigi vichcheyam̐gām̐gā raṁtula nīvalabĕllā rachchagĕkkĕnu kāṁtum̐ḍa yiḍugāgunna kannavārivĕṁṭanĕllā paṁtabu nīmanasidi parasai tirugum̐gā (||āba||) sĕli ninnu bujjagiṁchi sĕnagi navvam̐gām̐gā yilabai nīviḍadana mĕnniga kĕkkĕ laliyiṁtarem̐sagunna lāgula nīvayasĕllā palasanai lolonĕ paṁḍi tām̐ gaivālum̐gā (||āba||) niṁḍum̐gām̐giḍanĕ yābai nerubarim̐ jeyam̐gām̐gā duṁḍagavu nīsem̐talu tudagĕkkĕnu aṁḍanĕ śhrīvĕṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi raṁḍū niṁtagāgunna radi savigādugā