Title (Indic)ఆపె నేను సవతుల మామాఁటె నామాట WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె నేను సవతుల మామాఁటె నామాట తీపులు వుట్టించితిని తెలుసుకో ఇపుడు (॥ఆపె॥) ముందర నున్నది చెలి ముసి ముసి నవ్వులతో విందులు వెట్టీ మీకు వీడెపుమోవి చెంది నీకు మేలు సుద్ది చెప్పితి నిదివో నేను ఇందుకు నాకేమి మెచ్చు ఇచ్చేవో ఇపుడు (॥ఆపె॥) చేయి చాఁచీ నాపె నీపై సేసపాల దోసిటితో చాయల గప్పములిచ్చీ జంటచున్నులు సోయగపు సగినాలు చూచి చెప్పితి నిదివో తీయని నారుణ మెట్టు తీర్చేవో ఇపుడు (॥ఆపె॥) పొంకక కాఁగిలించీని కొనగోరి పంతాలతో వుంకువలు వెట్టీఁ జనవుల రతులు పొంకపు శ్రీ వేంకటేశ బుద్దులు చెప్పి కూడితి నింకా నాకుఁ జనవు లెట్లిచ్చేవో యిపుడు English(||pallavi||) ābĕ nenu savadula māmām̐ṭĕ nāmāḍa tībulu vuṭṭiṁchidini tĕlusugo ibuḍu (||ābĕ||) muṁdara nunnadi sĕli musi musi navvulado viṁdulu vĕṭṭī mīgu vīḍĕbumovi sĕṁdi nīgu melu suddi sĕppidi nidivo nenu iṁdugu nāgemi mĕchchu ichchevo ibuḍu (||ābĕ||) seyi sām̐sī nābĕ nībai sesabāla dosiḍido sāyala gappamulichchī jaṁṭasunnulu soyagabu saginālu sūsi sĕppidi nidivo tīyani nāruṇa mĕṭṭu tīrsevo ibuḍu (||ābĕ||) pŏṁkaga kām̐giliṁchīni kŏnagori paṁtālado vuṁkuvalu vĕṭṭīm̐ janavula radulu pŏṁkabu śhrī veṁkaḍeśha buddulu sĕppi kūḍidi niṁkā nāgum̐ janavu lĕṭlichchevo yibuḍu