Title (Indic)ఆపే నేను నొక్కటే అందుకేమయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపే నేను నొక్కటే అందుకేమయ్యా చేపట్టి యింతలో నేల సిగ్గులు వడేవు (॥॥) విన్నపములు వింటివా వెలఁది చెప్పెంపినవి సన్నల నీకవి యెల్లా సరివచ్చెనా నిన్నటి మీసుద్దులెల్లా నేఁదెలిసితి ననుచు నన్నుఁ జూచి నీవేల నడుమఁ గొంకేవు (॥॥) కానుక లందుకొంటివా కామిని నీకంపినవి తానకమై యవి నీచిత్తానఁ బట్టెనా నానాటి మీసరితలు నాకు దిష్ట మాయనని నే నిప్పుడేమనఁగాను నీవింత లోఁగేవు (॥॥) యేకతములాడితివా యింతిని రప్పించుకొని కైకొని శ్రీవేంకటేశ కలసితివా యీకడ నన్నేలితివి యిన్నియు నేగంటినని నాకొరకు నెంతేసి నవ్వులు నవ్వేవు. English(||pallavi||) ābe nenu nŏkkaḍe aṁdugemayyā sebaṭṭi yiṁtalo nela siggulu vaḍevu (||||) vinnabamulu viṁṭivā vĕlam̐di sĕppĕṁpinavi sannala nīgavi yĕllā sarivachchĕnā ninnaḍi mīsuddulĕllā nem̐dĕlisidi nanusu nannum̐ jūsi nīvela naḍumam̐ gŏṁkevu (||||) kānuga laṁdugŏṁṭivā kāmini nīgaṁpinavi tānagamai yavi nīsittānam̐ baṭṭĕnā nānāḍi mīsaridalu nāgu diṣhṭa māyanani ne nippuḍemanam̐gānu nīviṁta lom̐gevu (||||) yegadamulāḍidivā yiṁtini rappiṁchugŏni kaigŏni śhrīveṁkaḍeśha kalasidivā yīgaḍa nannelidivi yinniyu negaṁṭinani nāgŏragu nĕṁtesi navvulu navvevu.