Title (Indic)ఆపె నీ పట్టపుదేవు లాపెపై బత్తి గలవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె నీ పట్టపుదేవు లాపెపై బత్తి గలవు యేపున మీయిద్దరికి నింపులే యౌను (॥ఆప॥) వెనుకొని పతితోను వెంగేలు సతులాడినాఁ జనవు గలిగితేను సంతోస మౌను పెనఁగి వేఁడుకొనఁగాఁ బ్రియునితో బిగిసినా మనసు లెనసితేను మంచిదే యౌను (॥ఆప॥) పొట్టఁ బొరుగువారలు బొమ్మల జంకించి నాను చుట్టరికాలు గలితే సొంపులే యౌను వట్టిసణఁగులతో వాసిపంతాలు చూపినా నెట్టుకొన్న వానియైతే నెయ్యములే యౌను (॥ఆప॥) కొలువున నున్నవారు గుంపించి నవ్వినాను చెలిమి గలిగితే మచ్చిక యౌను యెలమి శ్రీవేంకటేశ యింతెల మేల్మంగ యాకె కలసితి రిద్దరును కడువేడు కౌను English(||pallavi||) ābĕ nī paṭṭabudevu lābĕbai batti galavu yebuna mīyiddarigi niṁpule yaunu (||āba||) vĕnugŏni padidonu vĕṁgelu sadulāḍinām̐ janavu galigidenu saṁtosa maunu pĕnam̐gi vem̐ḍugŏnam̐gām̐ briyunido bigisinā manasu lĕnasidenu maṁchide yaunu (||āba||) pŏṭṭam̐ bŏruguvāralu bŏmmala jaṁkiṁchi nānu suṭṭarigālu galide sŏṁpule yaunu vaṭṭisaṇam̐gulado vāsibaṁtālu sūbinā nĕṭṭugŏnna vāniyaide nĕyyamule yaunu (||āba||) kŏluvuna nunnavāru guṁpiṁchi navvinānu sĕlimi galigide machchiga yaunu yĕlami śhrīveṁkaḍeśha yiṁtĕla melmaṁga yāgĕ kalasidi riddarunu kaḍuveḍu kaunu