Title (Indic)ఆపె నన్ను నొక్కటిగా నప్పుడే సేసితివయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె నన్ను నొక్కటిగా నప్పుడే సేసితివయ్య- వో పో పో నీకేరడాల కోపము గాని (॥ఆపె॥) తక్కరిగాదు ఆపె తాటోటుఁ గాదు నీఁ వెక్కువ సేసి పొగడే యెంత గలదు చక్కనిది యౌను సరసురాలు నౌను వుక్కును సరిసేసుకో నోపము గాని (॥ఆపె॥) మంకుఁజల మెరఁగదు మందెమేళ మెరఁగదు అంకెల నీవు మోహించ నరుహ మౌను పొంకాలు నేరుచు నీతో పొందుసేయ నేరుచును వుంకువ నాపింటికిఁ బో నోపఁగాని (॥ఆపె॥) కలహమునకుఁ జొరదు కపటానకుఁ జొరదు అలరి నీవూడిగాని కాపె వలెను యెలమి శ్రీ వేంకటేశ యీడ నన్నుఁగూడితివి వొలిసి యెరిఁగించుకో నోపము గాని English(||pallavi||) ābĕ nannu nŏkkaḍigā nappuḍe sesidivayya- vo po po nīgeraḍāla kobamu gāni (||ābĕ||) takkarigādu ābĕ tāḍoḍum̐ gādu nīm̐ vĕkkuva sesi pŏgaḍe yĕṁta galadu sakkanidi yaunu sarasurālu naunu vukkunu sarisesugo nobamu gāni (||ābĕ||) maṁkum̐jala mĕram̐gadu maṁdĕmeḽa mĕram̐gadu aṁkĕla nīvu mohiṁcha naruha maunu pŏṁkālu nerusu nīdo pŏṁduseya nerusunu vuṁkuva nābiṁṭigim̐ bo nobam̐gāni (||ābĕ||) kalahamunagum̐ jŏradu kabaḍānagum̐ jŏradu alari nīvūḍigāni kābĕ valĕnu yĕlami śhrī veṁkaḍeśha yīḍa nannum̐gūḍidivi vŏlisi yĕrim̐giṁchugo nobamu gāni