You are here

Aabe naasellelu gaadaa amdugemi

Title (Indic)
ఆపె నాచెల్లెలు గాదా అందుకేమి
Work
Language
Credits
Role Artist
Writer Annamacharya

Lyrics

Telugu

(॥పల్లవి॥)
ఆపె నాచెల్లెలు గాదా అందుకేమి
నా పొందు విడువనని నమ్మించేవు నీవు

(॥ఆపె॥)
ప్రేమము గలిగినాపె ప్రియపడి మాటాడఁగా
నామోము చూచి యేమి నవ్వేవు నీవు
వేమరు గడ్డము వట్టి వేడుకొని పిలువఁగా
ఆముకొని నన్నే లప్పణడిగేవు నీవు

(॥ఆపె॥)
వావి గలసిన యాపె వలపులు చల్లఁగాను
సోవలుగా నాకేఁటికిఁ జూపేవు నీవు
కావరించి యిక్కువకు గనుసన్న సేయఁగా
భావించి నన్నెంత వొడఁబరచేవు నీవు

(॥ఆపె॥)
పొరుగున నున్నయాపె భుజముపైఁ జెయి వేయఁగా
అరసి నన్నిట్టుగూడే వప్పటి నీవు
నిరతి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
సిరుల నిచ్చకా లెన్ని సేసేవు నీవు

English

(||pallavi||)
ābĕ nāsĕllĕlu gādā aṁdugemi
nā pŏṁdu viḍuvanani nammiṁchevu nīvu

(||ābĕ||)
premamu galiginābĕ priyabaḍi māḍāḍam̐gā
nāmomu sūsi yemi navvevu nīvu
vemaru gaḍḍamu vaṭṭi veḍugŏni piluvam̐gā
āmugŏni nanne lappaṇaḍigevu nīvu

(||ābĕ||)
vāvi galasina yābĕ valabulu sallam̐gānu
sovalugā nāgem̐ṭigim̐ jūbevu nīvu
kāvariṁchi yikkuvagu ganusanna seyam̐gā
bhāviṁchi nannĕṁta vŏḍam̐barasevu nīvu

(||ābĕ||)
pŏruguna nunnayābĕ bhujamubaim̐ jĕyi veyam̐gā
arasi nanniṭṭugūḍe vappaḍi nīvu
niradi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
sirula nichchagā lĕnni sesevu nīvu

Lyrics search