Title (Indic)ఆపె మీఁద మోహ మైతే నౌదువు గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె మీఁద మోహ మైతే నౌదువు గాక మోపుగా నా మీఁద నెపములు వేయ వలెనా (॥ఆపమీద॥) నిన్ను నేమైన నంటినా నేనె తిట్టుకొంటిఁ గాక కన్ను లెఱ్ఱఁ జేసి నీవె కాఁగి పడేవు వన్నెల కెందో పొయ్యేవాఁడ వట్టె పోదు గాక అన్నిటా నాతో నేఁడు అలిగి పోవలెనా (॥ఆపమీద॥) చేరి నిన్ను దొబ్బితి నా చే వట్టకు మంటిఁ గాక పారి పారి రొమ్ము దట్టి పగ చాటేవు ఆరీతిఁ బెండ్లాడేవాఁడ వట్టె పెండ్లాడుదు గాక యీరీతి వాదు వెట్టుక యింత సేయ వలెనా (॥ఆపమీద॥) చెల్ల బో కైకో కుంటినా సిగ్గున నుంటిఁ కాక వొల్లనె నన్నింత దూరి వోల వేసేవు కొల్లగా శ్రీవెంకటేశ కూడితిని నన్ను నేఁడు చిల్లర సతిని నాచేతి కియ్య వలెనా English(||pallavi||) ābĕ mīm̐da moha maide nauduvu gāga mobugā nā mīm̐da nĕbamulu veya valĕnā (||ābamīda||) ninnu nemaina naṁṭinā nenĕ tiṭṭugŏṁṭim̐ gāga kannu lĕṭram̐ jesi nīvĕ kām̐gi paḍevu vannĕla kĕṁdo pŏyyevām̐ḍa vaṭṭĕ podu gāga anniḍā nādo nem̐ḍu aligi povalĕnā (||ābamīda||) seri ninnu dŏbbidi nā se vaṭṭagu maṁṭim̐ gāga pāri pāri rŏmmu daṭṭi paga sāḍevu ārīdim̐ bĕṁḍlāḍevām̐ḍa vaṭṭĕ pĕṁḍlāḍudu gāga yīrīdi vādu vĕṭṭuga yiṁta seya valĕnā (||ābamīda||) sĕlla bo kaigo kuṁṭinā sigguna nuṁṭim̐ kāga vŏllanĕ nanniṁta dūri vola vesevu kŏllagā śhrīvĕṁkaḍeśha kūḍidini nannu nem̐ḍu sillara sadini nāsedi kiyya valĕnā