Title (Indic)ఆపె మారు విన్నవించే నదివో నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె మారు విన్నవించే నదివో నేను చేపట్టిన నీచేతివే సేసెటి పనులు (॥ఆపె॥) ఆంగన నీ మాటలకు నాయములు గరఁగెను పొంగుచునుఁ జెమరించెఁ బులకించెను చెంగటి సిగ్గుతోడఁ జేరి నీతో మాటాడదు యింగితాన నీ చేతివే యిటమీఁదిపనులు (॥ఆపె॥) నీవు చే చాఁచినందుకె నివ్వెరగులఁ బొందెను భావము యింత మందె పచ్చి దేరెను తావుల కోరికల సందడిఁ బడి వున్న దదె యేవిధాన నీ చేతివే యిటమీఁదిపనులు (॥ఆపె॥) ఆడెటి నీ సరసాన కంతరంగము దనిసె వీడె మందుకొన నిన్నీ వేళఁ గూడెను జోడై శ్రీవెంకటేశ చొక్కులనె వోలవాడి యేడ నయీనా నీ చేతివే యిటమీఁదిపనులూ English(||pallavi||) ābĕ māru vinnaviṁche nadivo nenu sebaṭṭina nīsedive sesĕḍi panulu (||ābĕ||) āṁgana nī māḍalagu nāyamulu garam̐gĕnu pŏṁgusunum̐ jĕmariṁchĕm̐ bulagiṁchĕnu sĕṁgaḍi siggudoḍam̐ jeri nīdo māḍāḍadu yiṁgidāna nī sedive yiḍamīm̐dibanulu (||ābĕ||) nīvu se sām̐sinaṁdugĕ nivvĕragulam̐ bŏṁdĕnu bhāvamu yiṁta maṁdĕ pachchi derĕnu tāvula korigala saṁdaḍim̐ baḍi vunna dadĕ yevidhāna nī sedive yiḍamīm̐dibanulu (||ābĕ||) āḍĕḍi nī sarasāna kaṁtaraṁgamu danisĕ vīḍĕ maṁdugŏna ninnī veḽam̐ gūḍĕnu joḍai śhrīvĕṁkaḍeśha sŏkkulanĕ volavāḍi yeḍa nayīnā nī sedive yiḍamīm̐dibanulū