Title (Indic)ఆపె మాఁటే నా మాటఁ అవునయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె మాఁటే నా మాటఁ అవునయ్యా యేపొద్దూ నిట్టే చనవియ్యవయ్యా (॥॥) నవ్వించినపుడే నాతి కోపమెల్లాఁ బాసె రవ్వలుసేయక యిఁక రావయ్యా దవ్వులఁ జేయి చాఁచితే తగులాయమెల్ల నాయ వువ్విళ్ళూర సంగడిఁ గూచుండవయ్యా (॥॥) మాటాడించినప్పుడే మగువచలము దీరె చీటికి మాటికి నిఁకఁ జెనకవయ్యా సూటి గాఁగాఁ జూచితేనే సొంపులెల్లా సమకూడె గాటముగ ముందుముందే కాఁగిలించవయ్యా (॥॥) చేరి మొక్కించినప్పుడే సిగ్గులెల్లాఁ దేరెను జోరునఁ జెమట రతిఁ జొక్కించవయ్యా యీరీతి శ్రీవేంకటేశ యెనసితి విన్నిటాను నేరుపులెల్లా నిందే నెరపవయ్యా English(||pallavi||) ābĕ mām̐ṭe nā māḍam̐ avunayyā yebŏddū niṭṭe sanaviyyavayyā (||||) navviṁchinabuḍe nādi kobamĕllām̐ bāsĕ ravvaluseyaga yim̐ka rāvayyā davvulam̐ jeyi sām̐side tagulāyamĕlla nāya vuvviḽḽūra saṁgaḍim̐ gūsuṁḍavayyā (||||) māḍāḍiṁchinappuḍe maguvasalamu dīrĕ sīḍigi māḍigi nim̐kam̐ jĕnagavayyā sūḍi gām̐gām̐ jūsidene sŏṁpulĕllā samagūḍĕ gāḍamuga muṁdumuṁde kām̐giliṁchavayyā (||||) seri mŏkkiṁchinappuḍe siggulĕllām̐ derĕnu jorunam̐ jĕmaḍa radim̐ jŏkkiṁchavayyā yīrīdi śhrīveṁkaḍeśha yĕnasidi vinniḍānu nerubulĕllā niṁde nĕrabavayyā