Title (Indic)ఆపె మఱఁగున నీవేమైనాఁ జేసినది గద్దో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె మఱఁగున నీవేమైనాఁ జేసినది గద్దో పూఁప సన్నలనే కడుఁబొద్దులు వుచ్చెను (॥ఆపె॥) బత్తిసేసి యాకె నీపై పదములు వాడఁగాను యిత్తల నీవింతలోనే యేమి నవ్వేవు కొత్తగా సింగారించుకొన్నందుకు మెచ్చఁగాను చిత్తగించి నీవెంత సిగ్గువడేవు (॥ఆపె॥) కాయపు గురుతులపై కస్తూరి యలఁదరాఁగా చేయివట్టి ప్రియాలెంత చెప్పవచ్చేవు చాయల నీవలపులు సారెసారెఁ బొగడఁగా ఆయములు మోచీనంటా నానలేల పెట్టేవు (॥ఆపె॥) ముచ్చటతో నాపె నీమోవితేనె లానఁగాను ఇచ్చగించి పలుసోఁకు లేల దాఁచేవు పుచ్చుకా శ్రీవేంకటేశ కొమ్మ నినుఁ బెండ్లాడఁగా విచ్చన విడాయ నేల వేఁడుకొనేవు English(||pallavi||) ābĕ maṟam̐guna nīvemainām̐ jesinadi gaddo pūm̐pa sannalane kaḍum̐bŏddulu vuchchĕnu (||ābĕ||) battisesi yāgĕ nībai padamulu vāḍam̐gānu yittala nīviṁtalone yemi navvevu kŏttagā siṁgāriṁchugŏnnaṁdugu mĕchcham̐gānu sittagiṁchi nīvĕṁta sigguvaḍevu (||ābĕ||) kāyabu gurudulabai kastūri yalam̐darām̐gā seyivaṭṭi priyālĕṁta sĕppavachchevu sāyala nīvalabulu sārĕsārĕm̐ bŏgaḍam̐gā āyamulu mosīnaṁṭā nānalela pĕṭṭevu (||ābĕ||) muchchaḍado nābĕ nīmovidenĕ lānam̐gānu ichchagiṁchi palusom̐ku lela dām̐sevu puchchugā śhrīveṁkaḍeśha kŏmma ninum̐ bĕṁḍlāḍam̐gā vichchana viḍāya nela vem̐ḍugŏnevu