Title (Indic)ఆపె లాంచనము మోయనర్హమా నీకు నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె లాంచనము మోయనర్హమా నీకు నేఁడు యేపున మీ పొందు మాకు నెరిఁగించవలెనా (॥ఆపె॥) కోమలిగుబ్బలమీఁదిగురిగింజ పేరు నీమెడ వేసుకొంటివి నేరుపుతోను ఆముకొన్నమగవాఁడ వాఁటదానవయ్యేవా యేమిటి కొకరిసొమ్ము ఇయ్యవయ్య ఇఁకను (॥ఆపె॥) కలికినొసలనున్న కపురుబేగడబొట్టు పెలుచవై నీనుదుటఁ బెట్టుకొంటివి చెలఁగి బలుదొరవు చెంచుదాన వయ్యేవా యెలమి నెరపులసా మ్మియ్యవయ్య ఇఁకను (॥ఆపె॥) అంచగమన తురుమునందుండేపికిలికుచ్చు మించఁగ నీకొప్పుమీఁద నుంచుకొంటివి కొంచక శ్రీవేంకటేశ గొల్లదాన వయ్యేవా యెంచఁగ నన్నేలితివి సోమ్మియ్యవయ్య ఇఁకను English(||pallavi||) ābĕ lāṁchanamu moyanarhamā nīgu nem̐ḍu yebuna mī pŏṁdu māgu nĕrim̐giṁchavalĕnā (||ābĕ||) komaligubbalamīm̐digurigiṁja peru nīmĕḍa vesugŏṁṭivi nerubudonu āmugŏnnamagavām̐ḍa vām̐ṭadānavayyevā yemiḍi kŏgarisŏmmu iyyavayya im̐kanu (||ābĕ||) kaliginŏsalanunna kaburubegaḍabŏṭṭu pĕlusavai nīnuduḍam̐ bĕṭṭugŏṁṭivi sĕlam̐gi baludŏravu sĕṁchudāna vayyevā yĕlami nĕrabulasā mmiyyavayya im̐kanu (||ābĕ||) aṁchagamana turumunaṁduṁḍebigiliguchchu miṁcham̐ga nīgŏppumīm̐da nuṁchugŏṁṭivi kŏṁchaga śhrīveṁkaḍeśha gŏlladāna vayyevā yĕṁcham̐ga nannelidivi sommiyyavayya im̐kanu