Title (Indic)ఆపె కావలె నొండె అట్టె నేనే కావలె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె కావలె నొండె అట్టె నేనే కావలె యేపని కేపని సేసే విఁకనేడ సుద్దులు (॥ఆపె॥) గద్దరిచూపులఁ జూచి కన్నులనే మాటలాడి తిద్దుకొనె నిన్నుఁ జేతికిలోనుగా వొద్దనుండి మమ్మునేల వొడఁబరచేవు నీవు యిద్దరికి నోపుదువా యిఁకనేడ సుద్దులు (॥ఆపె॥) వోరికొట్లు గొట్టి నిన్ను వొరసి చన్నులనొ త్తి సారె నలవాటుసేసె జంట నీ కాపె చేరిచేరి మమ్మునేల చెనకేవు నీ విప్పుడు యేరా మమ్ముఁ గొసరే విఁకనేడ సుద్దులు (॥ఆపె॥) కమ్మటిని మోవి నీకిచ్చె కాఁగిటను బిగియించి నమ్మించి దక్కఁగోనెను నవ్వుతా నిన్ను దొమ్మిసేసి నను నీవు తొడిఁబడఁ గూడితివి యెమ్మెల శ్రీవేంకటేశ యిఁకనేడ సుద్దులు English(||pallavi||) ābĕ kāvalĕ nŏṁḍĕ aṭṭĕ nene kāvalĕ yebani kebani sese vim̐kaneḍa suddulu (||ābĕ||) gaddarisūbulam̐ jūsi kannulane māḍalāḍi tiddugŏnĕ ninnum̐ jedigilonugā vŏddanuṁḍi mammunela vŏḍam̐barasevu nīvu yiddarigi nobuduvā yim̐kaneḍa suddulu (||ābĕ||) vorigŏṭlu gŏṭṭi ninnu vŏrasi sannulanŏ tti sārĕ nalavāḍusesĕ jaṁṭa nī kābĕ seriseri mammunela sĕnagevu nī vippuḍu yerā mammum̐ gŏsare vim̐kaneḍa suddulu (||ābĕ||) kammaḍini movi nīgichchĕ kām̐giḍanu bigiyiṁchi nammiṁchi dakkam̐gonĕnu navvudā ninnu dŏmmisesi nanu nīvu tŏḍim̐baḍam̐ gūḍidivi yĕmmĕla śhrīveṁkaḍeśha yim̐kaneḍa suddulu