Title (Indic)ఆపె ఎఱఁగనిదా అంత నీవు సేసే మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె ఎఱఁగనిదా అంత నీవు సేసే మేలు తీపుల నీమోవి ఇచ్చి తిద్దుకొనరాదా (॥ఆపె॥) కూరిమిగలదానికి కోపము గలితేనేమి చేరి యందులొనే చవి చేసుకోరాదా నీరాక కెదురు చూచి నిన్నుఁ దిద్దితే నేమి గారవించి నవ్వు నవ్వి కాఁగిలించరాదా (॥ఆపె॥) మనసిచ్చినదానికి మందెమేళమైతే నేమి చెనకి యదె చవిచేసుకోరాదా చనవు నీ వొసఁగఁగా జంకించితే నేమి తనివంది రతుల చిత్తరిఁ జేయరాదా (॥ఆపె॥) పాయకున్న దానికి పంతమాడుకొంటే నేమి సేయరాని సేవ చవిచేసుకోరాదా యీయెడ శ్రీ వేంకటేశ యింతి నిట్టె కూడితివి కాయముపై కళలంటి కడు మెచ్చరాదా English(||pallavi||) ābĕ ĕṟam̐ganidā aṁta nīvu sese melu tībula nīmovi ichchi tiddugŏnarādā (||ābĕ||) kūrimigaladānigi kobamu galidenemi seri yaṁdulŏne savi sesugorādā nīrāga kĕduru sūsi ninnum̐ diddide nemi gāraviṁchi navvu navvi kām̐giliṁcharādā (||ābĕ||) manasichchinadānigi maṁdĕmeḽamaide nemi sĕnagi yadĕ savisesugorādā sanavu nī vŏsam̐gam̐gā jaṁkiṁchide nemi tanivaṁdi radula sittarim̐ jeyarādā (||ābĕ||) pāyagunna dānigi paṁtamāḍugŏṁṭe nemi seyarāni seva savisesugorādā yīyĕḍa śhrī veṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi kāyamubai kaḽalaṁṭi kaḍu mĕchcharādā