Title (Indic)ఆపె ఆతని బుద్ది అందాలకుఁ దెచ్చీఁగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె ఆతని బుద్ది అందాలకుఁ దెచ్చీఁగాని కోపుల సారెసారెఁ గొసరకురే (॥ఆపె॥) మొగము చూచినప్పుడు మోహము రెట్టించీఁగాని జిగి నందాఁకాఁ గక్కసించకురమ్మ నగిన యప్పుడు తానే నయానకు వచ్చీఁగాని పగటు బలిమిచూచి పంతములాడకురే (॥ఆపె॥) మాఁటలాడినప్పుడే మంకులు మానీఁగాని గాఁటానఁ జేయివట్టి పెనఁగకురమ్మ కూటమివేళనే మేలు కొనలుసాగీగాని పాటించి సారె సారెకు బలిమి సేయకురే (॥ఆపె॥) యేకాంతమయినప్పుడే ఇయ్యకోలయ్యీఁగాని చేకొని ఇంతేసి రట్టు సేయకురమ్మ యీకడ శ్రీ వేంకటేశుఁ డింతిని గక్కునఁ గూడె వాకిచ్చి మీరేమి నిఁక వంతులు వెట్టకురే English(||pallavi||) ābĕ ādani buddi aṁdālagum̐ dĕchchīm̐gāni kobula sārĕsārĕm̐ gŏsaragure (||ābĕ||) mŏgamu sūsinappuḍu mohamu rĕṭṭiṁchīm̐gāni jigi naṁdām̐kām̐ gakkasiṁchaguramma nagina yappuḍu tāne nayānagu vachchīm̐gāni pagaḍu balimisūsi paṁtamulāḍagure (||ābĕ||) mām̐ṭalāḍinappuḍe maṁkulu mānīm̐gāni gām̐ṭānam̐ jeyivaṭṭi pĕnam̐gaguramma kūḍamiveḽane melu kŏnalusāgīgāni pāḍiṁchi sārĕ sārĕgu balimi seyagure (||ābĕ||) yegāṁtamayinappuḍe iyyagolayyīm̐gāni segŏni iṁtesi raṭṭu seyaguramma yīgaḍa śhrī veṁkaḍeśhum̐ ḍiṁtini gakkunam̐ gūḍĕ vāgichchi mīremi nim̐ka vaṁtulu vĕṭṭagure