Title (Indic)ఆపెఱుఁగు నీ వెఱుఁగు దాలోని పనులెల్ల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపెఱుఁగు నీ వెఱుఁగు దాలోని పనులెల్ల యేపున విన్నవించితి మిదిగో చెలులము (॥ఆపె॥) యేమని చెప్పెంపుదువో యేవేళ వత్తువో యని కామిని యాడ నీవేళ గాచుకున్నది నీమన సెట్టువచ్చునో నీవూడిగ మబ్బుటెట్టో యీమేర నుందాననని యెంచుకొంటా నున్నది (॥ఆపె॥) యెప్పుడుమోము చూతువో యేసన్నసేతువోయని చొప్పుగా నీవంకే చూచుకవున్నది మెప్పించుకొందునో నీవు మేలమాడుదువోయని చప్పు డాలించుకొంటా నచ్చట నదె వున్నది (॥ఆపె॥) కందువకుఁ బిల్తువో ఇక్కడఁ గూడుదువోయని పొంది నీపానుపుమీఁదఁ బొంచుకున్నది అందపు శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె చెంది నీకాఁగిటఁ గూడి చెలరేఁగుచున్నది English(||pallavi||) ābĕṟum̐gu nī vĕṟum̐gu dāloni panulĕlla yebuna vinnaviṁchidi midigo sĕlulamu (||ābĕ||) yemani sĕppĕṁpuduvo yeveḽa vattuvo yani kāmini yāḍa nīveḽa gāsugunnadi nīmana sĕṭṭuvachchuno nīvūḍiga mabbuḍĕṭṭo yīmera nuṁdānanani yĕṁchugŏṁṭā nunnadi (||ābĕ||) yĕppuḍumomu sūduvo yesannaseduvoyani sŏppugā nīvaṁke sūsugavunnadi mĕppiṁchugŏṁduno nīvu melamāḍuduvoyani sappu ḍāliṁchugŏṁṭā nachchaḍa nadĕ vunnadi (||ābĕ||) kaṁduvagum̐ bilduvo ikkaḍam̐ gūḍuduvoyani pŏṁdi nībānubumīm̐dam̐ bŏṁchugunnadi aṁdabu śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ sĕṁdi nīgām̐giḍam̐ gūḍi sĕlarem̐gusunnadi