Title (Indic)ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు దూపలి తలఁచినా దోషహరము (॥ఆప॥) గరుడనినెక్కినఘనరేవంతుఁడు గరుడ కేతనముగలరథుఁడు గరుడఁడే తనకును గరియగుబాణము గరిమె నీతఁడేపో ఘనగారుడము (॥ఆప॥) పాముపరపుపై బండినసిద్ధుడు పాముపాశముల పరిహరము పామున నమృతముఁ పడఁదచ్చినతఁడు వేమరు నీతఁడే విషహరము (॥ఆప॥) కమలాక్షుఁ డీతఁడు కమలనాభుఁడును కమలాదేవికిఁ గైవశము అమరిన శ్రీవేంకటాధిపు డితఁడే మమతల మాకిదే మంత్రౌషధము English(||pallavi||) ābadbaṁdhum̐ḍu hari māgum̐ galam̐ḍu dūbali talam̐sinā doṣhaharamu (||āba||) garuḍaninĕkkinaghanarevaṁtum̐ḍu garuḍa kedanamugalarathum̐ḍu garuḍam̐ḍe tanagunu gariyagubāṇamu garimĕ nīdam̐ḍebo ghanagāruḍamu (||āba||) pāmubarabubai baṁḍinasiddhuḍu pāmubāśhamula pariharamu pāmuna namṛtamum̐ paḍam̐dachchinadam̐ḍu vemaru nīdam̐ḍe viṣhaharamu (||āba||) kamalākṣhum̐ ḍīdam̐ḍu kamalanābhum̐ḍunu kamalādevigim̐ gaivaśhamu amarina śhrīveṁkaḍādhibu ḍidam̐ḍe mamadala māgide maṁtrauṣhadhamu