Title (Indic)ఆపదల సంపదల నలయు టేమిట మాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపదల సంపదల నలయు టేమిట మాను రూపింప నిన్నిటను రోసిననుఁ గాక (॥ఆప॥) కడలేనిదేహరోగంబు లేమిట మాను జడనువిడిపించునౌషధసేవఁగాక విడవ కడియాస తను వేఁచు టేమిట మాను వొడలికలగుణమెల్ల నుడిగిననుఁగాక (॥ఆప॥) దురితసంగ్రహమైన దుఃఖ మేమిట మాను సరిలేని సౌఖ్యంబు చవిగొన్నఁగాక కరుకైన మోహంధకార మేమిట మాను ఆరిది తేజోమార్గ మలవడినఁగాక (॥ఆప॥) చావులోఁ బెనగొన్నజన్మ మేమిట మాను యీవలావలి కర్మ మెడసినఁ గాక భావింప నరుదైనబంధ మేమిట మాను శ్రీ వేంకటేశ్వరుని సేవచేఁ గాక English(||pallavi||) ābadala saṁpadala nalayu ṭemiḍa mānu rūbiṁpa ninniḍanu rosinanum̐ gāga (||āba||) kaḍalenideharogaṁbu lemiḍa mānu jaḍanuviḍibiṁchunauṣhadhasevam̐gāga viḍava kaḍiyāsa tanu vem̐su ṭemiḍa mānu vŏḍaligalaguṇamĕlla nuḍiginanum̐gāga (||āba||) duridasaṁgrahamaina duḥkha memiḍa mānu sarileni saukhyaṁbu savigŏnnam̐gāga karugaina mohaṁdhagāra memiḍa mānu āridi tejomārga malavaḍinam̐gāga (||āba||) sāvulom̐ bĕnagŏnnajanma memiḍa mānu yīvalāvali karma mĕḍasinam̐ gāga bhāviṁpa narudainabaṁdha memiḍa mānu śhrī veṁkaḍeśhvaruni sevasem̐ gāga