Title (Indic)ఆపాటి కాపాటి అంతే పో విభుఁడ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపాటి కాపాటి అంతే పో విభుఁడ చేపట్టి కొసరఁగఁ జెల్లునా మాకు (॥ఆపాటి॥) వలచినకొలఁ దింతే వనితలచనవు చలము సాదించఁబోతే చవివుట్టీనా పిలిచినకొలఁదీనే బెరసి నేఁ బలికితి చెలఁగి యింత కెక్కుడు చెల్లునా మాకు (॥ఆపాటి॥) ననిచినకొలఁ దింతే నగవూఁ దగవూ పెనఁగి పైపడఁబోతే బ్రియ మయ్యీనా మనసిచ్చినకొలఁదే మాటలు నే నాడితి చెనకఁగ దొరతోడఁ జెల్లునా మాకు (॥ఆపాటి॥) దగ్గరి కూడినయంతే తమకపుకౌఁగిలి వెగ్గళము సేయఁబోతే వేసట గాదా నిగ్గుల శ్రీవేంకటేశ నీవే నన్నుఁ గూడఁగాను సిగ్గుదీరెఁ గాక యింత చెల్లునా మాకు English(||pallavi||) ābāḍi kābāḍi aṁte po vibhum̐ḍa sebaṭṭi kŏsaram̐gam̐ jĕllunā māgu (||ābāḍi||) valasinagŏlam̐ diṁte vanidalasanavu salamu sādiṁcham̐bode savivuṭṭīnā pilisinagŏlam̐dīne bĕrasi nem̐ baligidi sĕlam̐gi yiṁta kĕkkuḍu sĕllunā māgu (||ābāḍi||) nanisinagŏlam̐ diṁte nagavūm̐ dagavū pĕnam̐gi paibaḍam̐bode briya mayyīnā manasichchinagŏlam̐de māḍalu ne nāḍidi sĕnagam̐ga dŏradoḍam̐ jĕllunā māgu (||ābāḍi||) daggari kūḍinayaṁte tamagabugaum̐gili vĕggaḽamu seyam̐bode vesaḍa gādā niggula śhrīveṁkaḍeśha nīve nannum̐ gūḍam̐gānu siggudīrĕm̐ gāga yiṁta sĕllunā māgu