Title (Indic)ఆ సుద్దులే చెప్పుకొనే మది నీవేలడిగేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆ సుద్దులే చెప్పుకొనే మది నీవేలడిగేవు దోస మానవెట్టకుము తోయరాదు మాకును (॥ఆను॥) వోరగండ్లను జూచి వొయ్యనే నీవాకెను చేరి వాఁడికొనగోరఁ జిమ్మవా నీవు సారెకునుఁ దమిరేఁగ సన్నలుసేసుకొంటా పేరుకొని నీయింటికిఁ బిలువవా నీవు (॥ఆను॥) తనువుఁదనువు సోఁక దండ నాకెఁ బెట్టుకొని ననుపుసేసుక కొంత నవ్వవా నీవు నిను నాపె జంకించఁగా నిమ్మపంట వేసుకొంటా పెనఁగుచు వలపులు పెంచవా నీవు (॥ఆను॥) పచ్చిదేర నీ వాపెను బలిమిఁ గాఁగిటఁబట్టి కొచ్చికొచ్చి మోవి చదవిగొనవా నీవు యిచ్చట శ్రీవేంకట యేలితివి నన్ను నేఁడు తచ్చి యాకెఁ దెరలోన దాఁచవా నీవు English(||pallavi||) ā suddule sĕppugŏne madi nīvelaḍigevu dosa mānavĕṭṭagumu toyarādu māgunu (||ānu||) voragaṁḍlanu jūsi vŏyyane nīvāgĕnu seri vām̐ḍigŏnagoram̐ jimmavā nīvu sārĕgunum̐ damirem̐ga sannalusesugŏṁṭā perugŏni nīyiṁṭigim̐ biluvavā nīvu (||ānu||) tanuvum̐danuvu som̐ka daṁḍa nāgĕm̐ bĕṭṭugŏni nanubusesuga kŏṁta navvavā nīvu ninu nābĕ jaṁkiṁcham̐gā nimmabaṁṭa vesugŏṁṭā pĕnam̐gusu valabulu pĕṁchavā nīvu (||ānu||) pachchidera nī vābĕnu balimim̐ gām̐giḍam̐baṭṭi kŏchchigŏchchi movi sadavigŏnavā nīvu yichchaḍa śhrīveṁkaḍa yelidivi nannu nem̐ḍu tachchi yāgĕm̐ dĕralona dām̐savā nīvu