Title (Indic)ఆ సుద్దు లన్నియుఁ జెలి నడుగరాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆ సుద్దు లన్నియుఁ జెలి నడుగరాదా సేసవెట్టితివి నీచేతిదాయ వలపు (॥॥) పొంకముగా నెవ్వతెతో పొందుసేసి వచ్చితివో జంకెన చూపుల నీకె సాదించీని లంకెల నప్పటి మరి లచ్చన లేమిగనెనో వుంకువ మోవెంటించితే వొడ్డుకొనీని (॥॥) మేరమీర వింతసొమ్ము మేన నీ కెంత వున్నదో నారుకొన సెలవుల నవ్వు నవ్వీని పేరుకొని యేవనిత పిలువఁ గ వినెనో వూరకే మాటాడఁ గాఁ జెవులు మూసుకొనీని (॥॥) వురము గందమెవ్వరి వొడల మెత్తినదో గరిమఁ గాఁగిలించితే కడులోఁ గీని మరిగి శ్రీ వేంకటేశ మనసెట్టు దెలిసెనో సరుగ నిన్నుఁ గూడి సన్న సేసీని English(||pallavi||) ā suddu lanniyum̐ jĕli naḍugarādā sesavĕṭṭidivi nīsedidāya valabu (||||) pŏṁkamugā nĕvvadĕdo pŏṁdusesi vachchidivo jaṁkĕna sūbula nīgĕ sādiṁchīni laṁkĕla nappaḍi mari lachchana lemiganĕno vuṁkuva movĕṁṭiṁchide vŏḍḍugŏnīni (||||) meramīra viṁtasŏmmu mena nī kĕṁta vunnado nārugŏna sĕlavula navvu navvīni perugŏni yevanida piluvam̐ ga vinĕno vūrage māḍāḍam̐ gām̐ jĕvulu mūsugŏnīni (||||) vuramu gaṁdamĕvvari vŏḍala mĕttinado garimam̐ gām̐giliṁchide kaḍulom̐ gīni marigi śhrī veṁkaḍeśha manasĕṭṭu dĕlisĕno saruga ninnum̐ gūḍi sanna sesīni