Title (Indic)ఆ సరి(గిం?)చి నాఁటదాని నలఇంచరా దందురు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆ సరి(గిం?)చి నాఁటదాని నలఇంచరా దందురు సేసిన నా విన్నపాలు చిత్తగించు మిఁకను (॥ఆస॥) కచ్చుపెట్టి యాపె నీకుఁ గాచుకవుండఁగానే వచ్చితి విప్పుడు నావద్దికి నీవు ముచ్చటతో నప్పటి నీమోము చూడఁగానే మచ్చికసేసి నాతో మాఁటలాడేవు (॥ఆస॥) కూరిమితో నాపె నీకొంగు వట్టుకుండఁగానే చేరి నాతో నవ్వేవు సెలవులను సారె సారె నీ యెదుట సన్నలు సేయఁగానే గారాన నన్ను నిట్టె కాఁగిలించేవు (॥ఆస॥) చేతులారా నాపె నీపై సేసలు చల్లఁగానే యేతుల సరసమాడే విప్పుడు నాతో కాతరాన శ్రీవేంకటేశ న న్నేలితివి నీతో నాపెఁ గూడఁగానే నీ మోవి నా కిచ్చేవు English(||pallavi||) ā sari(giṁ?)si nām̐ṭadāni nala̮iṁcharā daṁduru sesina nā vinnabālu sittagiṁchu mim̐kanu (||āsa||) kachchubĕṭṭi yābĕ nīgum̐ gāsugavuṁḍam̐gāne vachchidi vippuḍu nāvaddigi nīvu muchchaḍado nappaḍi nīmomu sūḍam̐gāne machchigasesi nādo mām̐ṭalāḍevu (||āsa||) kūrimido nābĕ nīgŏṁgu vaṭṭuguṁḍam̐gāne seri nādo navvevu sĕlavulanu sārĕ sārĕ nī yĕduḍa sannalu seyam̐gāne gārāna nannu niṭṭĕ kām̐giliṁchevu (||āsa||) sedulārā nābĕ nībai sesalu sallam̐gāne yedula sarasamāḍe vippuḍu nādo kādarāna śhrīveṁkaḍeśha na nnelidivi nīdo nābĕm̐ gūḍam̐gāne nī movi nā kichchevu