అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా
(॥పల్లవి॥)
అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా
వన్నెల నప్పులుగొన్నవారువో వీరు
(॥అన్న॥)
తెగనీక అప్పులెల్లాఁ దీసితీసి । వారు
తగిలినఁ బెట్టలేక దాఁగి దాఁగి
వెగటునఁ బారిపోఁగా వెంట వెంట । పెక్కు
పగల నప్పులుగొన్న వారువో వీరు
(॥అన్న॥)
సేయరానిపనులెల్లఁ జేసిచేసి । తవ-
రాయడికి లోలోనే రాసిరాసి
కాయములోచొచ్చిచొచ్చి కాఁచికాఁచి । మున్ను
వ్రాయనిపత్రాల కాఁగేవారువో వీరు
(॥అన్న॥)
దొరయై యప్పులవారిఁ దోసితోసి । యీ-
పరిభవములనెల్లఁ బాసిపాసి
సిరులవేంకటపతిఁ జేరిచేరి । యిట్టి ...
వరుసనే గెలిచినవారువో వీరు
(||pallavi||)
annalaṁṭām̐ dammulaṁṭā āṁḍlaṁṭā biḍḍalaṁṭā
vannĕla nappulugŏnnavāruvo vīru
(||anna||)
tĕganīga appulĕllām̐ dīsidīsi | vāru
tagilinam̐ bĕṭṭalega dām̐gi dām̐gi
vĕgaḍunam̐ bāribom̐gā vĕṁṭa vĕṁṭa | pĕkku
pagala nappulugŏnna vāruvo vīru
(||anna||)
seyarānibanulĕllam̐ jesisesi | tava-
rāyaḍigi lolone rāsirāsi
kāyamulosŏchchisŏchchi kām̐sigām̐si | munnu
vrāyanibatrāla kām̐gevāruvo vīru
(||anna||)
dŏrayai yappulavārim̐ dosidosi | yī-
paribhavamulanĕllam̐ bāsibāsi
sirulaveṁkaḍabadim̐ jeriseri | yiṭṭi ...
varusane gĕlisinavāruvo vīru